ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ ఏడాది-3% ఎఫ్‌ఎంసీజీ రంగ వృద్ధి

ABN, First Publish Date - 2020-11-27T06:32:49+05:30

ఈ ఏడాది మూడో త్రైమాసికం (జూలై-సెప్టెంబరు)లో దేశీయ ఎఫ్‌ఎంసీజీ రంగం పునరుద్ధరణ బాట పట్టిందని మార్కెట్‌ పరిశోధన సంస్థ నీల్సన్‌ పేర్కొంది. లాక్‌డౌన్‌ ప్రభావంతో రెండో త్రైమాసికంలో ఈ రంగ వృద్ధి వార్షిక ప్రాతిపదికన -19 శాతానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎఫ్‌ఎంసీజీ రంగ వృద్ధి

పతనంపై నీల్సన్‌ అంచనా


న్యూఢిల్లీ: ఈ ఏడాది మూడో త్రైమాసికం (జూలై-సెప్టెంబరు)లో దేశీయ ఎఫ్‌ఎంసీజీ రంగం పునరుద్ధరణ బాట పట్టిందని మార్కెట్‌ పరిశోధన సంస్థ నీల్సన్‌ పేర్కొంది. లాక్‌డౌన్‌ ప్రభావంతో రెండో త్రైమాసికంలో ఈ రంగ వృద్ధి వార్షిక ప్రాతిపదికన -19 శాతానికి పతనమైంది. సెప్టెంబరు త్రైమాసికంలో మళ్లీ మెరుగై 1.6 శాతంగా నమోదైందని తాజా నివేదికలో వెల్లడించింది. లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపుతో మార్కెట్‌ కార్యకలాపాలు క్రమంగా పుంజుకోవడం ఇందుకు దోహదపడిందని పేర్కొంది. అయితే, ఈ ఏడాది మొత్తానికి వృద్ధి అంచనాలను మాత్రం మరింత తగ్గించింది.


ఈ ఏడాది ఎఫ్‌ఎంసీజీ రంగ వృద్ధి గత ఏడాది స్థాయిలోనే నమోదు కావచ్చని తొలుత పేర్కొన్న నీల్సన్‌.. ఆ తర్వాత -1 శాతం క్షీణతను అంచనా వేసింది. -3 శాతానికి పతనం కావచ్చన్నది సంస్థ తాజా అంచనా. ఆర్థిక వ్యవస్థలోని పలు ప్రతికూలతలు ఈ రంగ పునరుద్ధరణకు అవరోధంగా మారవచ్చని అంటోంది. లాక్‌డౌన్‌ ఆంక్షల ఎత్తివేతతో స్టోర్ల కార్యకలాపాలు కూడా మెరుగయ్యాయి. రెండో త్రైమాసికంలో నెలకు సరాసరిగా 9 రోజులు స్టోర్లు మూసి ఉండగా.. మూడో త్రైమాసికంలో ఈ సంఖ్య 3 రోజులకు తగ్గిందని పేర్కొంది. 

Updated Date - 2020-11-27T06:32:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising