ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముకేశ్‌ @ నెం.4

ABN, First Publish Date - 2020-08-09T08:44:44+05:30

ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ నాలుగో స్థానానికి ఎగబాకారు. ఐరోపా కుబేరుడు, లూయిస్‌ విట్టన్‌ చైర్మన్‌ బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ను ఒక స్థానం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రపంచ కుబేరుల జాబితాలో మరో మెట్టు పైకి 

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ నాలుగో స్థానానికి ఎగబాకారు. ఐరోపా కుబేరుడు, లూయిస్‌ విట్టన్‌ చైర్మన్‌ బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ను ఒక స్థానం వెనక్కి నెట్టారు. బ్లూంబర్గ్‌ బిలియనీర్స్‌ రియల్‌ టైమ్‌ ఇండెక్స్‌ ప్రకారం, ఈ నెల 8వ తేదీ నాటికి ముకేశ్‌ అంబానీ వ్యక్తిగత సంపద 8,060 కోట్ల డాలర్లకు పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2,200 కోట్ల డాలర్లు వృద్ధి చెందింది. ఇదే సమయానికి బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ సంపద 2,510 కోట్ల డాలర్ల మేర క్షీణించి ప్రస్తుతం 8,020 కోట్ల డాలర్లకు పడిపోయింది. దాంతో ఆయన రిచ్‌ లిస్ట్‌లో ఐదో స్థానానికి జారుకున్నారు. ప్రపంచ టాప్‌-500 ధనవంతుల్లో ఈ ఏడాది అత్యధికంగా నష్టపోయింది ఈయనే. గడిచిన కొద్దివారాల్లో ప్రపంచ కుబేరుల జాబితాలోని చాలామంది ప్రముఖుల సంపద స్థాయిలను ముకేశ్‌ అధిగమిస్తూ వచ్చారు. ముకేశ్‌ దూకుడుకు వారెన్‌ బఫెట్‌, టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌, గూగుల్‌ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్‌, ల్యారీ పేజ్‌ రిచ్‌ లిస్ట్‌లో కిందికి జారారు. 

Updated Date - 2020-08-09T08:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising