ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిలయన్స్‌ రిటైల్‌లో ముబదాలకు వాటా

ABN, First Publish Date - 2020-10-02T07:21:30+05:30

అబుదాబీకి చెందిన సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ ముబదాల.. తాజాగా రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)లో రూ.6,247.5 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా 1.4 శాతం వాటాను చేజిక్కించుకుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రూ.6,247 కోట్ల పెట్టుబడి


న్యూఢిల్లీ : రిలయన్స్‌ రిటైల్‌ కంపెనీలోకి పెట్టుబడుల వరద కొనసాగుతోంది. అబుదాబీకి చెందిన సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌ ముబదాల.. తాజాగా రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఆర్‌వీఎల్‌)లో రూ.6,247.5 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా 1.4 శాతం వాటాను చేజిక్కించుకుంది. రిలయన్స్‌ రిటైల్‌లో పెట్టుబడులు పెట్టిన నాలుగో సంస్థ ఇది. గత నెల రోజుల్లోనే ముకేశ్‌ అంబానీ నాయకత్వంలోని ఈ రిటైల్‌ చెయిన్‌లో నాలుగు పీఈ సంస్థలు రూ.24,847.5 కోట్లతో 5.65 శాతం వాటా కొనుగోలు చేశాయి. ఇటీవల ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ వ్యాపారాన్ని కూడా రిలయన్స్‌ గ్రూప్‌ దాదాపు రూ.25,000 కోట్లతో కొనుగోలు చేసింది. దీంతో పలు అంతర్జాతీయ పీఈ, సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌ రిలయన్స్‌ రిటైల్‌ ఈక్విటీలో వాటా కోసం ఆసక్తి చూపిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని పీఈ సంస్థలు రిలయన్స్‌ రిటైల్‌లో మరిన్ని పెట్టుబడులు పెడతాయని భావిస్తున్నారు.

Updated Date - 2020-10-02T07:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising