ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాటి సంక్షోభం కంటే భారీ ప్రభావం... ‘ఇన్ఫోసిస్-హెచ్‌ఎఫ్‌ఎస్’ సర్వేలో వెల్లడి...

ABN, First Publish Date - 2020-12-04T21:50:27+05:30

భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావాన్నే చూపింది. అన్ని రంగాలపై తారస్థాయిలో ప్రభావం కనిపించింది. ఇన్ఫోసిస్ హెచ్‌ఎఫ్ఎస్ రీసెర్చ్ సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావాన్నే చూపింది. అన్ని రంగాలపై తారస్థాయిలో ప్రభావం కనిపించింది.  ఇన్ఫోసిస్ హెచ్‌ఎఫ్ఎస్ రీసెర్చ్ సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. వివిధ రంగాల్లోని వ్యాపారాలపై బడ్జెట్, సరఫరా వ్యవస్థలు, ఉద్యోగుల లభ్యత తదితర అంశాల ప్రభావం ఏ మేరకు పడిందన్న అంశాలపై ఈ సంస్థలు సంయుక్తంగా  అధ్యయనం చేశాయి. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితికి ‘రిమోట్ వర్క్’ మాత్రమే సరైన పరిష్కారమని ఈ సర్వేలో పాల్గొన్న 51 వ్యవస్థలుఅభిప్రాయపడ్డాయి.


2008 కంటే ప్రభావం ఎక్కువ... 

హెచ్‌ఎఫ్‌ఎస్ రీసెర్చ్-ఇన్ఫోసిస్ సంయుక్తంగా 400 గ్లోబల్, 2000 ఎగ్జిక్యూటివ్స్‌ను సర్వేలో భాగంగా ప్రశ్నించారు. కరోనా నేపధ్యంలో  చితికిపోయిన వ్యాపారాలు ఏ మేరకు కోలుకుంటాయి ? ప్రస్తుత పరిస్థితిని అధిగమించి ఎలా ముందుకెళ్తున్నాయి ? అన్న అంశాల నేపధ్యంతో సర్వే నిర్వహించారు. కాగా... 2008 లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కంటే కరోనా వల్ల వచ్చిన ఇబ్బందులు పెద్దవని, కంపెనీలపై కరోనా భారీ ప్రభావాన్ని చూపిందని 70 శాతం మంది/సంస్థలు అభిప్రాయపడ్డాయి.


ఐటీ వ్యయాలను పెంచుతాయి... ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడినుండైనా వర్క్ లేదా హైబ్రిడ్ వర్క్ ఫోర్స్ నమూనాతో ముందుకు వెళ్లే వెసులుబాటు ఉందని 51 శాతం సంస్థలు తెలిపాయి. బ్యాంకింగ్, బీమా, హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్, హై-టెక్ ఇండస్ట్రీల్లోకి సంక్షోభ సమయంలో పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. క్లౌడ్, సైబర్ భద్రత, ఆధునికీకరణ డిజిటల్ వ్యాపార నమూనాలను, ఐటీ వ్యయాలను ఇవి పెంచుతాయని సర్వేలో వెల్లడైంది. మార్పును స్వీకరించేందుకు, వ్యాపారాలను డిజిటలీకరణ చేసేందుకు కార్పోరేట్ ప్రపంచానికి కరోనా దోహదపడిందని వెల్లడించారు.


కరోనా తర్వాత పరిస్థితులకు అణుగుణంగా పని విధానం మారాల్సిన అవసరాన్ని 90 శాతం సంస్థలు గుర్తించాయి. ‘కార్యాలయ’ వాతావరణం కొనసాగుతుందని కేవలం 37 శాతం కంపెనీలు మాత్రమే చెప్పాయి. తమ వ్యాపారాలు ‘అస్థిరత’ నుండి ‘మెరుగైన స్థితి’కి చేరుకుంటాయని 65 శాతం మంది, డిజిటల్ పరివర్తనకు వేగంగా మారే ప్రణాళికను 60 శాతం కంపెనీలు, ఉత్పత్తి-సేవల పోర్ట్‌పోలియోను మార్చుకోవడం ద్వారా విలువైన ఖాతాదారుల వ్యాల్యూను పెంచుకునేందుకు 70 శాతం సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేస్తుకుంటున్నాయి.


Updated Date - 2020-12-04T21:50:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising