ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4 కంపెనీల ఔషధాలు రీకాల్‌

ABN, First Publish Date - 2020-07-06T06:14:32+05:30

అమెరికా మార్కెట్‌ నుంచి వివిధ లోపాల కారణంగా నాలుగు భారత ఫార్మా కంపెనీలు తమ ఔషధాలు రీకాల్‌ చేశాయి. హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మాతో పాటు లుపిన్‌, మార్క్‌సన్స్‌ ఫార్మా, అలెంబిక్‌ ఆ కంపెనీల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అమెరికా మార్కెట్‌ నుంచి వివిధ లోపాల కారణంగా నాలుగు భారత ఫార్మా కంపెనీలు తమ ఔషధాలు రీకాల్‌ చేశాయి. హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మాతో పాటు లుపిన్‌, మార్క్‌సన్స్‌ ఫార్మా, అలెంబిక్‌ ఆ కంపెనీల్లో ఉన్నాయి. మానసిక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే క్లోజాపైన్‌ 1440 సీసాలను అరబిందో ఫార్మా యుఎ‌స్ఏ ఇంక్‌ రీకాల్‌ చేసింది. 100 ఎంజి బాటిల్స్‌లో 50 ఎంజి టాబ్లెట్లున్నాయన్న ఫిర్యాదు కారణంగా వాటిని రీకాల్‌ చేశారు. మానసిక వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మరో ఔషధాన్ని అలెంబిక్‌ ఫార్మా రీకాల్‌ చేయగా లుపిన్‌, మార్క్‌సన్స్‌ ఫార్మా మధుమేహ వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఔషధాలు రీకాల్‌ చేశాయి. మధుమేహం టాబ్లెట్ల తయారీలో మంచి ప్రమాణాలు పాటించలేదన్న అభియోగాల కారణంగా ఆ కంపెనీలు ఈ చర్య తీసుకున్నట్టు యుఎ‌స్‌ఎ‌ఫ్‌డీఏ తెలిపింది. 


Updated Date - 2020-07-06T06:14:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising