ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణాంకాలు, ఫలితాలపైనే ఆశలు

ABN, First Publish Date - 2020-08-10T06:01:52+05:30

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో గత వారం దేశీయ స్టాక్‌ మార్కె ట్లు పాజిటివ్‌గానే సాగాయి. ఈ వారం మైక్రో డేటా, కార్పొరేట్‌ ఫలితాలు మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించనున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటంతో గత వారం దేశీయ స్టాక్‌ మార్కె ట్లు పాజిటివ్‌గానే సాగాయి. ఈ వారం మైక్రో డేటా, కార్పొరేట్‌ ఫలితాలు మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించనున్నాయి. కీలక స్థాయిలకు చేరువగా ఉండటంతో అప్రమత్తతను సూచిస్తున్నాయి. ఈ వారం మార్కెట్లు 11300- 11350 పాయింట్ల మధ్యన ట్రేడయ్యే అవకాశం ఉంది. డౌన్‌ట్రెండ్‌లోకి సాగితే 11100 వద్ద మద్దతు స్థాయిలుంటాయి. ఇక్కడ కరెక్షన్‌కు అవకాశం ఉంది. 10950-10880 స్థాయిలకు చేరుకోవచ్చు. 


స్టాక్‌ రికమండేషన్స్‌

బెర్జర్‌ పెయింట్స్‌: గడిచిన నెల రోజులుగా ఈ షేరు కన్సాలిడేట్‌ అవుతూ వస్తోంది. ఇటీవల బ్రేకౌట్‌ సాధించి నిలకడగా సాగుతోంది. గత శుక్రవారం రూ.555.15 వద్ద క్లోజైన ఈ షేరును రూ.525 స్టాప్‌లా్‌సగా పెట్టుకుని రూ.580 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు.

ముత్తూట్‌ ఫైనాన్స్‌: గత మూడు నెలలుగా గోల్డ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లన్నీ దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. కొన్ని వారాలుగా ఈ షేరు కూడా అదే ధోరణిలో సాగుతోంది. అయితే రానున్న రోజుల్లో స్వల్ప పుల్‌ బ్యాక్‌కు అవకాశాలున్నాయి. స్వల్పకాలిక చార్టులు బలహీనతను సూచిస్తున్నాయి. గత శుక్రవారం కంపెనీ షేరు రూ.926.40 వద్ద క్లోజైంది. రూ.1,265ను స్టాప్‌లా్‌సగా పెట్టుకుని రూ.1,140 నుంచి లాభాలు స్వీకరించే విషయాన్ని పరిశీలించవచ్చు. - సమీత్‌ చవాన్‌, చీఫ్‌ అనలిస్ట్‌ టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌  


నోట్‌:  పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Updated Date - 2020-08-10T06:01:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising