ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిటైల్‌ స్పేస్‌ లీజింగ్‌పై ప్రభావం

ABN, First Publish Date - 2020-03-30T09:03:37+05:30

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాపర్టీ మార్కె ట్‌ ఎలా ఉన్నా కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌పై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాపర్టీ మార్కె ట్‌ ఎలా ఉన్నా కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ మా త్రం మంచి పనితీరును కనబరుస్తూ వస్తోంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆఫీస్‌, రిటైల్‌ స్పేస్‌ డిమాండ్‌-సప్లయ్‌ మధ్య స్వల్పకాలంలో వ్యత్యాసం ఏర్పడే అవకాశం ఉందని, ఫలితంగా అద్దెలపైనా ఒత్తిడి ఉండవచ్చని భావిస్తున్నారు. దేశీయ, విదేశీ కార్పొరేట్లు, రిటైలర్లు వాణిజ్య ప్రదేశాన్ని అద్దెకు తీసుకునే విషయంలో కనీసం మూడు నెలల పాటు వేచిచూడవచ్చని అంటున్నారు. ఇప్పటికైతే ఆఫీస్‌ లీజింగ్‌ డిమాండ్‌  ప్రభావితం కాలేదని, ఇప్పుడున్న పరిస్థితు ల్లో స్వల్పకాలంలో కొత్తగా తీసుకునే నిర్ణయాలపై ప్రభావం ఉండవచ్చని సీబీఆర్‌ఈ చైర్మన్‌, సీఈఓ (ఆగ్నేయాసియా, పశ్చిమాసియా, ఆఫ్రికా) అన్షుమన్‌ మాగజైన్‌ తెలిపారు. 

Updated Date - 2020-03-30T09:03:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising