ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొలువులపై కోవిడ్‌-19 పంజా

ABN, First Publish Date - 2020-03-22T05:30:00+05:30

కోవిడ్‌-19 ప్రభావం కొత్త కొలువులపైనా కనిపిస్తోంది. ఇంటర్వ్యూలకు ఎంపికైన 60-65 శాతం మందికి పలు కంపెనీలు ముఖాముఖి పరీక్షలను రద్దు చేయటమో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఇంటర్యూలను రద్దు చేస్తున్న కంపెనీలు 

ముంబై: కోవిడ్‌-19 ప్రభావం కొత్త కొలువులపైనా కనిపిస్తోంది. ఇంటర్వ్యూలకు ఎంపికైన 60-65 శాతం మందికి పలు కంపెనీలు ముఖాముఖి పరీక్షలను రద్దు చేయటమో లేదంటే వాయిదా వేస్తున్నాయి. బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా (బీఎ్‌ఫఎ్‌సఐ), రిటైల్‌, లాజిస్టిక్స్‌ వంటి సేవల కంపెనీల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోందని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ బిజినెస్‌ హెడ్‌ అమిత్‌ వధేరా అన్నారు. దీంతో ఈ ఏడా ది కొత్త ఉద్యోగులు కొలువుల్లో చేరటం బాగా ఆలస్యమయ్యే అవకాశముందని ఆయన చెప్పారు. అయితే, కొత్త నియామకాలు ఆలస్యమైనా ఉత్పాదకత తగ్గకుండా ఉండేందుకు కం పెనీలు సరికొత్త టెక్నాలజీలపై దృష్టిపెడుతున్నాయన్నారు.


కొన్ని రంగాల పరిస్థితి మరీ ఘోరం

కరోనా వైరస్‌ దెబ్బకు ఇప్పటికే కొన్ని రంగాలు నీరసించాయి. ఆతిథ్యం, పర్యాటక, విమానయానం వంటి రంగాలకు చెందిన కొన్ని కంపెనీల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. దీంతో చాలా కంపెనీల ఆదాయాలు పడిపోయి ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందుకోసం కొన్ని కంపెనీలు ఉన్న సిబ్బందికే జీతాలు ఇవ్వలేక ‘లీవ్‌ విత్‌ నో పే’ అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే త్రైమాసికంలో కొత్త నియామకాలు ఎంత లేదన్నా 10-15 శాతం తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా. 


ప్లేస్‌మెంట్లపైనా ప్రభావం

మరోవైపు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లపైనా కోవిడ్‌-19 ప్రభావం కనిపిస్తోంది. ఆర్థిక మందగమనం కారణంగా గత ఏడాదితో పోలిస్తే కంపెనీలు ఇప్పటికే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు తగ్గించాయి. దీనికి కోవిడ్‌-19 తోడవడంతో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఇంటర్న్‌షిప్‌ వచ్చిన విద్యార్ధులకూ ఉద్యోగ హామీ లేకుండా పోయింది. ఖర్చులు తగ్గించుకునేందుకు కొన్ని కంపెనీలు వీరిని మధ్యలోనే ఇంటికి పంపిస్తున్నట్టు సమాచారం. 

Updated Date - 2020-03-22T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising