ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రెడిట్‌ కార్డ్‌ కంపెనీలకు కొవిడ్‌ కష్టాలు

ABN, First Publish Date - 2020-10-31T06:50:30+05:30

కొవిడ్‌-19 మహమ్మారి క్రెడిట్‌ కార్డు కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. మాంద్య పరిస్థితులు నెలకొన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రమాదంలో రూ.1.04 లక్షల కోట్ల చెల్లింపులు

న్యూఢిల్లీ: కొవిడ్‌-19 మహమ్మారి క్రెడిట్‌ కార్డు కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. మాంద్య పరిస్థితులు నెలకొన్న సమయంలో పులి మీద పుట్రలా వచ్చిన కరోనాతో పలువురు ఉ ద్యోగాలు కోల్పోగా... కొంతమంది వేతనాలు గణనీయంగా తగ్గిపోయాయి. దీంతో క్రెడిట్‌ కార్డులు ఉన్న వారు బకాయిలు తీర్చడం చాలా కష్టంగా మారింది.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు ముగిసే నాటికి ఈ బకాయిల మొత్తం ఎంత లేదన్నా రూ.1.04 లక్షల కోట్ల వరకు ఉంటాయని అంచనా. ఇందులో ఎంత మొత్తానికి గండి పడుతుందోనని బ్యాంకులు, క్రెడిట్‌ కార్డు కంపెనీలు భయపడుతున్నాయి. 


మొండి పద్దుల భయం 

క్రెడిట్‌ కార్డు కంపెనీలపై మొండి బకాయిల ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. సెప్టెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్స్‌.. కంపెనీ స్థూల మొండి బకాయిలు ఏకంగా 4.29 శాతానికి చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. మిగతా కంపెనీల పరిస్థితీ దాదాపు ఇదేలా ఉంది.

ఆరు నెలల మారటోరియం, రెండేళ్ల పాటు బకాయిల చెల్లింపులను పునర్‌ వ్యవస్థీకరించడం లేకపోతే క్రెడిట్‌ కార్డు కంపెనీల అసలు ఎన్‌పీఏలు ఎంతో మరింత స్పష్టంగా తెలిసేవి. 


Updated Date - 2020-10-31T06:50:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising