స్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలకు ఝలక్... తక్కు వడ్డీకే కోటక్ రుణాలు
ABN, First Publish Date - 2020-11-04T00:55:38+05:30
వేట్‌రంగ దిగ్గజ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కన్నా కొటక్ లో తక్కువ వడ్డీకే రుణాలందుతున్నాయి. బ్యాంకు ఖాతాదారులను ఈ నిర్ణయం తారస్థాయిలో ఆకర్షిస్తోంది.
ఎముంబై : ప్రైవేట్‌రంగ దిగ్గజ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కన్నా కొటక్ లో తక్కువ వడ్డీకే రుణాలందుతున్నాయి. బ్యాంకు ఖాతాదారులను ఈ నిర్ణయం తారస్థాయిలో ఆకర్షిస్తోంది.
15 బేసిస్ పాయింట్ల కోత... ఖాతాదారులకు ప్రయోజనం...
ప్రస్తుతం మార్కెట్‌లో చౌక వడ్డీకే రుణాలు అందుబాటులో ఉన్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్... 15 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. నవంబరు ఒకటి నుంచే ఈ రేట్ల కోత నిర్ణయం అమలులోకి వచ్చిందని బ్యాంక్ ప్రకటించింది. రేట్ల కోత నిర్ణయంతో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు 6.75 శాతం నుంచి ప్రారంభమవుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు 15 ఏళ్ల కనిష్ట స్థాయిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందుకే సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావించే వారు ఇప్పుడు వారి పనిని పూర్తి చేసుకోవడం బెటర్.
ఇకపోతే దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్స్‌పై 6.9 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తోంది. కోటక్ బ్యాంక్ నిర్ణయంతో ఎస్‌బీఐ ఝలక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా ఇదే వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ అందిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా 6.85 శాతం వడ్డీకి రుణాలు అందిస్తోంది. బీఓబీ నిర్ణయంపట్ల ఖాతాదారులు హర్షం ప్రకటిస్తున్నారు.
Updated Date - 2020-11-04T00:55:38+05:30 IST