ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిలయన్స్‌ రిటైల్‌లో కేకేఆర్‌ పెట్టుబడులు

ABN, First Publish Date - 2020-09-24T06:08:34+05:30

రిలయన్స్‌ రిటైల్‌లో కేకేఆర్‌ పెట్టుబడులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.5,550 కోట్లకు 1.28ు వాటా కొనుగోలు 

న్యూఢిల్లీ: రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఆర్‌వీఎల్‌)లో 1.28 శాతం వాటాను రూ.5,550 కోట్లకు కొనుగోలు చేసేందుకు అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ దిగ్గజం కేకేఆర్‌ అండ్‌ కో ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎల్‌) బుధవారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఆర్‌ఐఎల్‌ రిటైల్‌ వ్యాపార విభాగమే ఆర్‌ఆర్‌వీఎల్‌. ఈ డీల్‌లో భాగంగా రిలయన్స్‌ రిటైల్‌ మార్కెట్‌ విలువను రూ.4.21 లక్షల కోట్లుగా లెక్కగట్టారు. రిలయన్స్‌ రిటైల్‌లోకి రెండో పెట్టుబడి ఇది. అమెరికాకు చెందిన మరో ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ సిల్వర్‌ లేక్‌ పార్ట్‌నర్స్‌.. రూ.7,500 కోట్లకు 1.75 శాతం వాటా కొనుగోలు చేసింది. అంతేకాదు, రిలయన్స్‌ వ్యాపారాల్లో కేకేఆర్‌కు ఇది రెండో పెట్టుబడి. ఆర్‌ఐఎల్‌ డిజిటల్‌ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 2.32 శాతం వాటాను కేకేఆర్‌ రూ.11,367 కోట్లకు చేజిక్కించుకుంది. కేకేఆర్‌ తన ఆసియా విభాగ ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్స్‌ నుంచి రిలయన్స్‌ రిటైల్‌లో ఇన్వెస్ట్‌ చేస్తోంది. పలు నియంత్రణ మండళ్లు, ఇతర అనుమతులకు లోబడి ఈ పెట్టుబడుల ఒప్పంద లావాదేవీ పూర్తికానుంది. 


కేకేఆర్‌ గురించి.. 

ఈ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ 1976లో ప్రారంభమైంది. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి కంపెనీ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ 22,200 కోట్ల డాలర్లు. భారత్‌లో 15కు పైగా కంపెనీల్లో 510 కోట్ల డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టింది. కేకేఆర్‌ ఇన్వెస్ట్‌ చేసిన దేశీ కంపెనీల జాబితాలో జియో ప్లాట్‌ఫామ్స్‌, జేబీ కెమికల్స్‌, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌, యూరోకిడ్స్‌ ఇంటర్నేషనల్‌, రామ్‌కీ ఎన్విరో ఇంజినీర్స్‌ కూడా ఉన్నాయి.


అతిపెద్ద రిటైల్‌ కంపెనీ 

రిలయన్స్‌ రిటైల్‌ దేశంలో అతిపెద్ద, శరవేగంగా వృద్ధి చెందుతున్న, అత్యంత లాభదాయక రిటైల్‌ కంపెనీ. సూపర్‌ మార్కెట్లు, ఎలకా్ట్రనిక్‌ ఉత్పత్తుల స్టోర్లతోపాటు క్యాష్‌ అండ్‌ క్యారీ టోకు విక్రయ కేంద్రాలు, ఫ్యాషన్‌ స్టోర్లను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా కంపెనీకి సుమారు 12,000 స్టోర్లు ఉన్నాయి. మే నెలలో ప్రారంభించిన జియోమార్ట్‌ ద్వారా ఆన్‌లైన్‌ కిరాణా సరుకుల విక్రయంలోకీ ప్రవేశించింది. గతనెలలో రిలయన్స్‌ రిటైల్‌ భారీ కొనుగోలుకు పాల్పడింది. మరో దేశీయ రిటైల్‌ దిగ్గజం ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన పలు ఆస్తులను రూ.24,713 కోట్లకు దక్కించుకుంది. భారత రిటైల్‌ మార్కెట్లో అమెజాన్‌, వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌కు గట్టిపోటీనిచ్చేందుకు రిలయన్స్‌ రిటైల్‌ క్రమంగా బలం పుంజుకుంటోంది. జియోమార్ట్‌ సేవలు, ఫ్యూచర్‌ గ్రూప్‌ ఆస్తుల కొనుగోలు, పెట్టుబడుల సమీకరణ.. ఈ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులంటున్నారు.

Updated Date - 2020-09-24T06:08:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising