ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫార్మాలో స్ఫూర్తిదాయక పారిశ్రామికులు కిరణ్‌, జీవీ ప్రసాద్‌

ABN, First Publish Date - 2020-04-28T05:33:39+05:30

మాలిక్యూల్స్‌, బయో ఫార్మాలో అత్యంత ప్రభావశీల పారిశ్రామికవేత్తల జాబితాలో డాక్టర్‌ రెడ్డీస్‌ కో చైర్మన్‌ జీవీ ప్రసాద్‌, బయోకాన్‌ అధినేత్రి కిరణ్‌ మజుందార్‌ షాకుస్థానం దక్కింది. మెడిసిన్‌ మేకర్‌ పవర్‌ లిస్ట్‌ 20 పేరిట రూపొందించిన 60 మంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: మాలిక్యూల్స్‌, బయో ఫార్మాలో అత్యంత ప్రభావశీల పారిశ్రామికవేత్తల జాబితాలో డాక్టర్‌ రెడ్డీస్‌ కో చైర్మన్‌ జీవీ ప్రసాద్‌, బయోకాన్‌ అధినేత్రి కిరణ్‌ మజుందార్‌ షాకుస్థానం దక్కింది. మెడిసిన్‌ మేకర్‌ పవర్‌ లిస్ట్‌ 20 పేరిట రూపొందించిన 60 మంది జాబితాలో భారత్‌ నుంచి ఈ ఇద్దరే ఉన్నారు. చిన్న మాలిక్యూల్స్‌, బయో ఫార్మాస్యూటికల్స్‌, అడ్వాన్స్‌డ్‌ మెడిసిన్‌ విభాగాల్లో నవ్యపథం సృష్టించిన వారిని ఈ జాబితాలోకి తీసుకోగా జీవీ ప్రసాద్‌ (చిన్న మాలిక్యూల్స్‌), కిరణ్‌ మజుందార్‌ (బయో ఫార్మా) ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నారు.


  



ఒక్కో విభాగంలో 20 మందికి స్థానం దక్కింది. వారందరూ వృత్తిపరమైన నైపుణ్యాలతోనే పరిశ్రమను ముందుకు నడుపుతున్నారని, కొత్త ఔషధాలు కనుగొనడం ద్వారా లక్షలాది ప్రాణాలను కాపాడుతున్నారని నివేదిక ప్రశంసించింది. ప్రపంచాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కోవిడ్‌-19 మహమ్మారికి వీలైనంత త్వరలో కొత్త ఔషధాలు అభివృద్ధి చేసి దాని నిర్మూలనలో కూడా వారు ముందువరుసలో నిలుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా కిరణ్‌ మజుందార్‌ షాకు వరుసగా ఆరోసారి ఈ గౌరవం లభించడం తమకు గర్వకారణమని బయోకాన్‌ తెలిపింది.

Updated Date - 2020-04-28T05:33:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising