ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కియా సోనెట్‌ ఇంటీరియర్ డిజైన్ అదుర్స్..

ABN, First Publish Date - 2020-07-31T01:54:25+05:30

కియా మోటార్స్‌ ఇండియా తన సరికొత్త కియా సోనెట్‌ వాహనపు ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్‌ చిత్రాలను నేడు విడుదల చేసింది. శక్తివంతమైన డిజైన్‌‌తో పాటు మొట్టమొదటిసారిగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కియా మోటార్స్‌ ఇండియా తన సరికొత్త కియా సోనెట్‌ వాహనపు ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్‌ చిత్రాలను నేడు విడుదల చేసింది. శక్తివంతమైన డిజైన్‌‌తో పాటు మొట్టమొదటిసారిగా ఎన్నో సరికొత్త ఫీచర్లు తమ కియా సోనెట్‌లో ఉన్నట్లు సంస్థ తెలిసింది. ఈ వాహనాన్ని ఆగస్టు 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తొలిసారిగా మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. తద్వారా కంపాక్ట్‌ ఎస్‌యువీ విభాగంలో తమదైన ముద్ర వేయనున్నట్లు కియా స్పష్టం చేస్తోంది. ప్రధానంగా క్యాబిన్‌ చాలా విలావసవంతంగా ఉండడమే కాక ఆకర్షణీయంగా కూడా ఉంటుందని.. అంతేకాకుండా సరళమైన స్వీపింగ్‌ డాష్‌బోర్డ్‌, మినిమలిస్టిక్‌ సెంటర్‌ కన్సోల్‌లు దీని ప్రత్యేకతని చెబుతోంది. తమ వాహనం యువతకు ఆకర్షించడమే కాకుండా విలాసవంతమైన అనుభూమినీ ఇస్తుందని సంస్థ స్పష్టం చేస్తోంది. ‘డ్రైవర్‌తో పాటుగా ప్రయాణీకులకు గరిష్ట సౌకర్యం అందించేలా అత్యాధునిక ఇంటీరియర్‌ను పొందుపరిచాం. ముఖ్యంగా లోపలి భాగం ప్రకాశవంతంగా ఉండి డ్రైవర్లకు అత్యున్నత డైనమిజం అందిస్తుంది. మొబైల్‌ వంటి వాటిని ఉంచుకునేందుకు రెండు లేయర్ల ట్రే ఉంటుంది. అత్యున్నత సాంకేతిక డిజిటల్‌ డిస్‌ప్లే, ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ ఇందులోని మరొక ప్రత్యేకత.


ఈ విభాగంలో తొలిసారి 10.25 అంగుళాల హెచ్‌డీ టచ్‌స్ర్కీన్‌, నేవిగేషన్‌ వ్యవస్థలు యూవీఓ కనెక్టెడ్‌ టెక్నాలజీస్‌తో ఏర్పాటు చేయడం జరిగింది. సోనెట్‌ వాహనాలు డ్రైవర్లకు స్టీరింగ్‌ వీల్‌పై అమర్చిన కంట్రోల్స్‌ను అందిస్తుంది. అలాగే విభిన్నమైన డ్రైవ్‌, ట్రాక్షన్‌ కంట్రోల్స్‌ను అందిస్తుంది. డాష్‌బోర్డ్‌లోని ఎయిర్‌వెంట్స్‌ మెటాలిక్‌, డైమండ్‌ నుర్లెడ్‌ ప్యాట్రన్‌లతో పాటుగా ఆకర్షణీయమైన డిజైన్‌ ఈ ఎస్‌యూవీలో హైలైట్‌ అని చెప్పాలి’ అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Updated Date - 2020-07-31T01:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising