ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారాంతంలో కొనుగోళ్ల జోష్‌

ABN, First Publish Date - 2020-09-26T06:36:11+05:30

ప్రపంచ మార్కెట్లో ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ మెరుగవడంతో దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు భారీగా కొనుగోళ్లకు పాల్పడ్డాయి. రూపాయి బలపడటమూ స్టాక్‌ మార్కెట్లకు కలిసి వచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెన్సెక్స్‌ 835 పాయింట్లు పైకి.. 6 రోజుల వరుస నష్టాలకు తెర 

రూ.3.5 లక్షల కోట్లు పెరిగిన సంపద 


ముంబై: ప్రపంచ మార్కెట్లో ట్రేడింగ్‌ సెంటిమెంట్‌ మెరుగవడంతో దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు భారీగా కొనుగోళ్లకు పాల్పడ్డాయి. రూపాయి బలపడటమూ స్టాక్‌ మార్కెట్లకు కలిసి వచ్చింది. దాంతో ఈక్విటీ సూచీల ఆరు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. వారాంతం ట్రేడింగ్‌ ముగిసేసరికి బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ఏకంగా 835.06 పాయింట్లు పెరిగి 37,388.66 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 244.70 పాయింట్లు లాభపడి 11,050.25 వద్ద ముగిసింది. ప్రధాన కంపెనీలతో పోలిస్తే చిన్న, మధ్య స్థాయి షేర్ల కొనుగోలుకు ట్రేడర్లు ఎగబడ్డారు. దాంతో బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 2.31 శాతం, మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 2.90 శాతం పెరిగాయి. తత్ఫలితంగా బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.3.52 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ.152,28,237 కోట్లకు చేరుకుంది.  బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 6.85 శాతం పెరుగుదలతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ 5 శాతం పుంజుకోగా.. ఎయిర్‌టెల్‌, ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ 4 శాతం పైగా బలపడ్డాయి. బీఎ్‌సఈలోని అన్ని రంగ సూచీలు పుంజుకున్నాయి. టెలికాం సూచీ 5.73 శాతం ఎగబాకింది. టెక్నాలజీ 4 శాతం, ఐటీ 3.63 శాతం పెరిగాయి. 

Updated Date - 2020-09-26T06:36:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising