ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిలయన్స్ జియో నుంచి ఆండ్రాయిడ్ ఫోన్!

ABN, First Publish Date - 2020-12-08T00:25:30+05:30

రిలయన్స్ జియో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేస్తోంది. నిజానికి ఈ ఫోన్ ఈ నెలలోనే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రిలయన్స్ జియో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేస్తోంది. నిజానికి ఈ ఫోన్ ఈ నెలలోనే వస్తుందన్న వార్తలు తొలుత వినిపించాయి. అయితే, తాజా సమాచారాన్ని బట్టి ఇది వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌తో పనిచేసే ఈ ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్‌ను గూగుల్ సహకారంతో రిలయన్స్ తీసుకొస్తోంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో గూగుల్ రూ. 33,737 కోట్లు పెట్టుబడి పెట్టింది. రియల్‌మి, షియోమీ వంటి చైనా బ్రాండెడ్ ఫోన్లకు దీటుగా అతి తక్కువ ధరలో 4జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చేందుకు ఈ పెట్టుబడి ఉపకరిస్తుందని ఈ ఏడాది జులైలో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ పేర్కొంది. 


జియో ఆండ్రాయిడ్ ఫోన్ ప్రస్తుతం పరీక్షల దశలో ఉంది. ఇది మార్కెట్లోకి రావడానికి మూడు నెలలు పట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. వినియోగదారులను పెద్ద ఎత్తున ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఫోన్ ధరను దాదాపు రూ. 4 వేలుగా నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. చైనా బ్రాండ్స్‌ను ఎదుర్కొనేందుకు వచ్చే రెండేళ్లలో 200 మిలియన్ స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం.  

Updated Date - 2020-12-08T00:25:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising