ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అపోలో ప్రోటాన్‌’కు జేసీఐ గుర్తింపు

ABN, First Publish Date - 2020-07-04T06:45:23+05:30

అపోలో హాస్పిటల్స్‌ కు చెందిన అపోలో ప్రోటాన్‌ కేన్సర్‌ సెంటర్‌ (ఏపీసీసీ)కి జాయింట్‌ కమిషనర్‌ ఇంటర్నేషనల్‌ (జేసీఐ) ధ్రువీకరణ లభించింది. చెన్నైలోని ఏపీసీసీ.. దక్షిణాసియా, మధ్యప్రాచ్యంలోనే ఏకైక ప్రోటాన్‌ థెరఫీ కేంద్రం. దాదాపు ఏడాది క్రితం దీన్ని రూ.1,300 కోట్ల వ్యయంతో అపోలో హాస్పిటల్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): అపోలో హాస్పిటల్స్‌ కు చెందిన అపోలో ప్రోటాన్‌ కేన్సర్‌ సెంటర్‌ (ఏపీసీసీ)కి జాయింట్‌ కమిషనర్‌ ఇంటర్నేషనల్‌ (జేసీఐ) ధ్రువీకరణ లభించింది. చెన్నైలోని ఏపీసీసీ.. దక్షిణాసియా, మధ్యప్రాచ్యంలోనే ఏకైక ప్రోటాన్‌ థెరఫీ కేంద్రం. దాదాపు ఏడాది క్రితం దీన్ని రూ.1,300 కోట్ల వ్యయంతో అపోలో హాస్పిటల్స్‌ ప్రారంభించింది. కేన్సర్‌కు మరింత మెరుగైన చికిత్స అందించడానికి ఈ కేన్సర్‌ కేంద్రం దోహదం చేస్తుందని అపోలో హాస్పిటల్స్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి రెడ్డి తెలిపారు. దేశంలోనే జేసీఐ ధ్రువీకరణ పొందిన మొదటి అడ్వాన్స్‌డ్‌  కేన్సర్‌ కేంద్రం ఇదేనని వివరించారు. జేసీఐ అక్రిడేషన్‌ పొందిన ఎనిమిదో అపోలో ఆసుపత్రి అవుతుంది. అంతర్జాతీయ స్థాయిలో రోగుల రక్షణ, భద్రత ప్రమాణాలు పాటించే ఆసుపత్రులకు జేసీఐ ధ్రువీకరణ లభిస్తుంది. గత ఏడాది కాలంలో ఏపీసీసీలో దాదాపు 200 మందికి ప్రోటాన్‌ థెరఫీ చేశారు. ఇందులో 30 శాతం మంది విదేశాల నుంచి వచ్చిన వారే. ఏటికేడాది కేన్సర్‌ రోగు లు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో మరిన్ని ప్రత్యేక కేన్సర్‌ ఆసుపత్రుల అవసరం ఏర్పడుతోందని.. అందువల్ల మరో రెం డు చోట్ల (ముంబై, ఢిల్లీ) ప్రోటాన్‌ థెరఫీ కేంద్రాలను ప్రారంభించాలని యోచిస్తున్నామని ప్రతాప్‌ రెడ్డి చెప్పారు. దేశంలో ప్రతి ఏడాది 16-18 లక్షల మంది కేన్సర్‌ రోగుల జాబితాలో చేరుతున్నారన్నారు. కేన్సర్‌ను బట్టి ప్రోటాన్‌ థెరఫీకి రూ.31 లక్షల నుంచి రూ.45 లక్షల వరకూ ఖర్చవుతుంది. 150 పడకల సామర్థ్యంతో ఏపీసీసీని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అపోలోకు 10 కేన్సర్‌ ఆసుపత్రులున్నాయి. విజయవాడ, భువనేశ్వర్‌లో మరో మూడింటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Updated Date - 2020-07-04T06:45:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising