ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది అనైతికం... వొడా, ఎయిర్‌టెల్‌లపై ట్రాయ్ కు జియో ఫిర్యాదు...

ABN, First Publish Date - 2020-12-15T19:37:51+05:30

వొడాఫోన్ ఐడియా(వీఐ), ఎయిర్‌టెల్ సంస్థలపై టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)కు రిలయన్స్ జియో ఫిర్యాదు చేసింది. ఆ టెల్కోలు అనైతికంగా మొబైల్ నెంబర్ పోర్టబులిటీ(ఎంఎన్‌పీ)కి పాల్పడుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లేఖ రాసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : వొడాఫోన్ ఐడియా(వీఐ), ఎయిర్‌టెల్ సంస్థలపై టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్)కు రిలయన్స్ జియో  ఫిర్యాదు చేసింది. ఆ టెల్కోలు అనైతికంగా మొబైల్ నెంబర్ పోర్టబులిటీ(ఎంఎన్‌పీ)కి పాల్పడుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లేఖ రాసింది. దేశంలో పలు ప్రాంతాల్లో రైతు ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రైతు ఉద్యమంలో టెల్కోలు అనైతికంగా ఎంఎన్‌పీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు గుప్పించింది. 


ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఇండియా సంస్థలు తమ ఉద్యోగులు, ఏజెంట్లు, రిటైలర్ల ద్వారా అనైతికంగా ఎంఎన్‌పీకి పాల్పడుతున్నాయని జియో తన లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. జియో నుండి తమ నెట్ వర్క్‌కు మారడమంటే రైతులకు మద్దతు తెలపడమేనని చెబుతున్నట్లు ఈ నెల 10 న ట్రాయ్‌కు రాసిన లేఖలో పేర్కొంది. 


అది తప్పుడు ప్రచారం... చర్యలు తీసుకోవాలి... 

కేంద్రం తీసుకు వచ్చిన రైతు సంస్కరణల చట్టాల నేపధ్యంలో రిలయన్స్ లాభపడుతుందనే తప్పుడు ప్రచారం చేస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని జియో కోరింది. ఈ వ్యవసాయ చట్టాల వల్ల రిలయన్స్‌కు ప్రయోజనమంటూ ఆ కంపెనీలు ఉద్దేశ్యపూర్వకంగా ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా అనైతికంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని జియో ఆరోపించింది. ఈ అసత్య ప్రచారాన్ని నమ్ముతుండడంతో తన కస్టమర్లు ‘పోర్ట్ ఔట్ రిక్వెస్ట్’ చేస్తున్నట్లు తెలిపింది. ప్రత్యర్థి కంపెనీలు జియోను దెబ్బకొట్టేందుకే రైతు ఉద్యమాన్ని వినియోగించుకుంటున్నాయని ధ్వజమెత్తింది. 


ఆరోపణలు దారుణం : ఎయిర్‌టెల్, వొడాఫోన్... 

     జియో ఆరోపణలపై భారతీ ఎయిర్‌టెల్ స్పందించింది. ఈ ఆరోపణలు దారుణమని ఎయిర్‌టెల్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్... ట్రాయ్‌కు రాసిన లేఖలో తెలిపారు. పాతిక సంవత్సరాలుగా  తాము ఈ రంగంలో ఉన్నామని, మార్కెట్ లో తీవ్ర పోటీని ఎదుర్కొన్నామని, ఖాతాదారులకు అత్యుత్తమ సేవలనందించేందుకు కృషి చేశామని పేర్కొంది. తమపై జియో చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని వొడాఫోన్ ఇండియా అధికార ప్రతినిధి వెల్లడించారు.


Updated Date - 2020-12-15T19:37:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising