ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైదరాబాద్‌కు ఐఓసీ పైప్‌లైన్‌

ABN, First Publish Date - 2020-12-03T06:14:16+05:30

వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా రూ.1689 కోట్లతో ఇం డియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐ ఓసీ) వివిధ ప్రాజెక్టులు చేపడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీలో రూ. 1689 కోట్ల పెట్టుబడులు 

ఐఓసీ హెడ్‌ (ఏపీ, తెలంగాణ) ఆర్‌ఎ్‌సఎస్‌ రావు


విజయవాడ (ఆంధ్రజ్యోతి): వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా రూ.1689 కోట్లతో ఇం డియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐ ఓసీ) వివిధ ప్రాజెక్టులు చేపడుతోంది. ఏపీ - తెలంగాణా స్టేట్‌ హెడ్‌ ఆర్‌ఎ్‌సఎస్‌ రావు బుధవారం విజయవాడలో విలేకరు ల సమావేశంలో మాట్లాడుతూ ఒరిస్సా నుంచి ఏపీ మీదుగా తెలంగాణాకు భారీ పైప్‌లైన్‌కు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ పైప్‌లైన్‌ ఏపీలో 723 కిలోమీటర్ల మేర ఉంటుందని, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడలను కలుపుతూ హైదరాబాద్‌కు అనుసంధానం అవుతుందని చెప్పారు. విశాఖలో ఏర్పాటు చేసే నూతన టెర్మినల్‌కు ఈ పైప్‌లైన్‌ కనెక్ట్‌ అవుతుందన్నారు. వైజాగ్‌ సమీపంలోని అచ్యుతాపురం దగ్గర 60 ఎకరాల విస్తీర్ణంలో రూ. 468 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ టెర్మినల్‌ నిల్వ సామర్థ్యం 74 వేల కిలోలీటర్లని చెప్పారు.


ఇది కాకుండా నూతన బాట్లింగ్‌ ప్లాంట్‌తో పాటు డిపోలు, టెర్మినల్స్‌ , ట్యాంక్స్‌ వంటి మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఐఓసీకి విశాఖపట్నం, కొండపల్లి, కడపలలో మూడు బాట్లింగ్‌ ప్లాంట్లున్నాయన్నారు. ఈ బాట్లింగ్‌ ప్లాంట్ల ద్వారా ప్రతి రోజూ లక్ష సిలిండర్లను సరఫరా చేయటం జరుగుతోందన్నారు. చిత్తూరు జిల్లాలో కొత్తగా రూ. 167 కోట్ల వ్యయంతో ఎల్‌పీజీ బాట్లింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 

Updated Date - 2020-12-03T06:14:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising