ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత ఐటీ.. రివర్స్‌ గేర్‌!

ABN, First Publish Date - 2020-04-05T06:07:20+05:30

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) రంగంపైనా కరోనా వైరస్‌ ప్రభావం గట్టిగానే ఉందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సంవత్సరంలో భారత ఐటీ రంగ వృద్ధి గత ఏడాది స్థాయిలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) రంగంపైనా కరోనా వైరస్‌ ప్రభావం గట్టిగానే ఉందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సంవత్సరంలో భారత ఐటీ రంగ వృద్ధి గత ఏడాది స్థాయిలో లేదా అంతకంటే తగ్గి రుణాత్మకంలోకి జారుకోవచ్చని ఇన్ఫోసిస్‌ మాజీ సీఎ్‌ఫఓ బాలకృష్ణన్‌  అభిప్రాయపడ్డారు. ఇంకా ఆయనేమన్నారంటే.. 


కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పరిస్థితి 2008 ఆర్థిక మాంద్యం నాటి కంటే అధ్వానంగా ఉంది. 


ఈ నేపథ్యంలో భారత ఐటీ కంపెనీల క్లయింట్లు ఆధునిక సాంకేతికత కోసం వ్యయాన్ని పెంచకపోవచ్చు. ప్రస్తుత స్థాయి వ్యయాన్ని సైతం కొనసాగించే అవకాశాలు కన్పించడం లేదు. 


ఆయా రంగాల్లో ఐటీ వ్యయం తగ్గడంతోపాటు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పెరగనుంది. ఎందుకంటే, అంతర్జాతీయంగా రిటైల్‌, ఆర్థిక సేవల రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 


అమెరికాలో నిరుద్యోగిత రేటూ పెరగనుంది. ఆర్థిక వ్యవస్థల పనితీరు పూర్తిగా పతనమైంది. ఈ నేపథ్యంలో వ్యవస్థలో కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోనుంది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది ఐటీ రంగానికి గడ్డుకాలమే. 

Updated Date - 2020-04-05T06:07:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising