ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2020-21లో భారత ఆర్థిక వ్యవస్థ భారీ పతనం: ఏడీబీ అంచనా

ABN, First Publish Date - 2020-06-18T23:40:08+05:30

కరోనా కల్లోలం కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 4 శాతం వరకు క్షీణించే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా కల్లోలం కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 4 శాతానికి క్షీణించే అవకాశాలు ఉన్నాయని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) తన అంచనా వేసింది. తన వార్షిక నివేదిక ఏషియన్ డెవలప్‌మెంట్ అవుట్‌లుక్‌(ఏడీవో)లో ఏడీబీ ఈ మేరకు పేర్కొంది. ‘డెవలపింగ్ ఏషియా’ దేశాల్లో కూడా 2020 ఏడాది ఆర్థికవృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుందని ఏడీబీ పేర్కొంది. ఆసియా- పసిఫిక్ ప్రాంతంలోని ‘డెవలపింగ్ ఏషియా’లో మొత్తం 45 దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో 2020 సంవత్సరంలో వృద్ధి 0.1 శాతంగా మాత్రమే ఉండొచ్చనీ.. 1961 తర్వాత ఈ స్థాయిలో మందగించడం ఇదే తొలిసారి అవుతుందని ఏడీబీ పేర్కొంది. కాగా 2021లో మాత్రం ఈ ప్రాంతంలో అత్యధిక స్థాయిలో 6.2 శాతం వరకు వృద్ధి నమోదవుతుందని ఏడీబీ అంచనా వేసింది.  

Updated Date - 2020-06-18T23:40:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising