భారత్‌లో ఇప్పటికీ చైనా ఫోన్లదే హవా
ABN, First Publish Date - 2020-12-30T06:45:52+05:30
గాల్వాన్ సరిహద్దు వివాదం అనంతరం చైనా ఉత్పత్తులను బహిష్కరించాలన్న నినాదాలు మిన్నంటిన నేపథ్యంలోనూ భారత
అక్టోబరులో 17 లక్షల యూనిట్ల అధిక విక్రయాలు
న్యూఢిల్లీ: గాల్వాన్ సరిహద్దు వివాదం అనంతరం చైనా ఉత్పత్తులను బహిష్కరించాలన్న నినాదాలు మిన్నంటిన నేపథ్యంలోనూ భారత మొబైల్ మార్కెట్లో డ్రాగన్ కంపెనీలదే హవా కొనసాగుతోంది. టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఐడీసీ డేటా ప్రకారం.. ఈ ఏడాది అక్టోబరులో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు (ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కలిపి) వార్షిక ప్రాతిపదికన 42 శాతం వృద్ధి చెంది 2.1 కోట్ల యూనిట్లుగా నమోదయ్యాయి.
ఇందులో మెజారిటీ అమ్మకాలు ఆన్‌లైన్ ద్వారానే జరిగాయని సంస్థ తెలిపింది. అక్టోబరులో అత్యధికంగా అమ్ముడైన టాప్-5 బ్రాండ్లలో నాలుగు (షామీ, వివో, రియల్‌మీ, ఒప్పో) చైనాకు చెందినవే. గత ఏడాది అక్టోబరులో 46.07 లక్షల యూనిట్లుగా నమోదైన ఈ నాలుగు బ్రాండ్ల అమ్మకాలు.. ఈ ఏడాది అక్టోబరులో మరో 17 లక్షల యూనిట్లు పెరిగి 63.01 లక్షలకు చేరుకున్నట్లు ఐడీసీ తెలిపింది.
Updated Date - 2020-12-30T06:45:52+05:30 IST