ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీడియాది ఎదురీతే

ABN, First Publish Date - 2020-06-05T05:52:05+05:30

చలనచిత్ర నిర్మాణం, ప్రదర్శన, ప్రింట్‌ మీడియా, టెలివిజన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగాలన్నింటి పరపతి రేటింగ్‌ ప్రతికూలంగానే ఉంటుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తేల్చి చెప్పింది. అయితే ఓటీటీ, డిస్ర్టిబ్యూషన్‌ విభాగాలకు మాత్రం స్థిర రేటింగ్‌ ఇచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రతికూల రేటింగ్‌ ప్రకటించిన ఇక్రా


న్యూఢిల్లీ: చలనచిత్ర నిర్మాణం, ప్రదర్శన, ప్రింట్‌ మీడియా, టెలివిజన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగాలన్నింటి పరపతి రేటింగ్‌ ప్రతికూలంగానే ఉంటుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా తేల్చి చెప్పింది. అయితే ఓటీటీ, డిస్ర్టిబ్యూషన్‌ విభాగాలకు మాత్రం స్థిర రేటింగ్‌ ఇచ్చింది. భారత మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో భిన్న విభాగాలపై కొవిడ్‌-19  ప్రభావం మిశ్రమంగా ఉన్నదని, వివిధ కంపెనీలు బాధ, ఆశ, అవకాశాలు అనే మూడు భావాల మధ్యన ఊగిసలాడుతున్నాయని ఇక్రా తాజా నివేదికలో పేర్కొంది. సినిమా హాళ్లు మూసివేయడం వల్ల విక్రయాలు పూర్తిగా నిలిచిపోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో స్థూల వాతావరణం, అడ్వర్‌టైజ్‌మెంట్‌ వ్యయాల భారీ క్షీణత వల్ల ఏప్రిల్‌, మే నెలలు రెండింటిలోనూ పూర్తిగా ప్రతికూల వాతావరణాన్నే ఈ రంగం ఎదుర్కొన్నట్టు తెలిపింది. స్వల్పకాలంలో ఈ పరిస్థితిలో మార్పేమీ ఉండబోదని తేల్చి చెబుతూ ఈ ప్రభావం వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో భిన్న విభాగాల్లో ఆదాయాలు, లాభాల మార్జిన్లు బాగా క్షీణిస్తాయని తెలిపింది.  


ప్రింట్‌ మీడియాకు 40 శాతం నష్టం

లాక్‌డౌన్‌ పరిమితుల కారణంగా పంపిణీ అవరోధాలు ఏర్పడడంతో ప్రింట్‌ మీడియా ఆదాయాలు గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్‌లో 40 శాతం మేరకు తగ్గాయని ఇక్రా తేల్చింది. నిరాశావహమైన ఆర్థిక వాతావరణం కారణంగా ఏప్రిల్‌లో ప్రకటనల వ్యయాలు 60 నుంచి 70 శాతం క్షీణించినట్టు తెలిపింది.  ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం వల్ల ఓటీటీ వినియోగం బాగా పెరిగిందని, దాంతో వాణిజ్య ప్రకటనల్లో ఆ విభాగం రాజ్యం ఏలుతోందని ఇక్రా పేర్కొంది. సినిమాహాళ్లు మూతపడినందు వల్ల ఓటీటీలో లార్జ్‌ ఫార్మాట్‌కు ఆదరణ పెరిగిందని తేల్చి చెప్పింది.  



Updated Date - 2020-06-05T05:52:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising