ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాభాల్లోకి ఐడీబీఐ బ్యాంక్‌

ABN, First Publish Date - 2020-05-31T06:23:58+05:30

ఐడీబీఐ బ్యాంక్‌ ఎట్టకేలకు లాభాల్లోకి అడుగుపెట్టింది. వరుసగా 13 త్రైమాసికాలుగా నష్టాలను మూటగట్టుకుంటూ వస్తున్న ఐడీబీఐ బ్యాంక్‌ గడచిన ఆర్థిక సంవత్సరం (2019-20) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఐడీబీఐ బ్యాంక్‌ ఎట్టకేలకు లాభాల్లోకి అడుగుపెట్టింది. వరుసగా 13 త్రైమాసికాలుగా నష్టాలను మూటగట్టుకుంటూ వస్తున్న ఐడీబీఐ బ్యాంక్‌ గడచిన ఆర్థిక సంవత్సరం (2019-20) మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో రూ.135 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం (2018-19) ఇదే కాలంలో బ్యాంక్‌ రూ.4,918 కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. పదమూడు త్రైమాసికాల అనంతరం బ్యాంకు నికర లాభాన్ని ప్రకటించిందని, కరోనా ప్రభావం లేకుంటే ఇది మరింత ఎక్కువగా ఉండేదని ఐడీబీఐ బ్యాంక్‌ ఎండీ, సీఈఓ రాకేశ్‌ శర్మ తెలిపారు. కొవిడ్‌-19 కారణంగా మార్చి నెలలో రికవరీలపై ప్రభావం పడిందని, దాదాపు రూ.700 కోట్ల వరకు రికవరీలు నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు.  కాగా మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంక్‌ రూ.12,887 కోట్ల నికర నష్టాలను మూటగట్టుకుంది. 

Updated Date - 2020-05-31T06:23:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising