టాస్క్‌తో ఐబీఎం జట్టు
ABN, First Publish Date - 2020-12-15T06:48:37+05:30
టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఐబీఎం.. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో జట్టు కట్టింది.
హైదరాబాద్: టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఐబీఎం.. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో జట్టు కట్టింది. ఇందులో భాగంగా విద్యార్ధుల్లో సాంకేతిక, ప్రొఫెషనల్ నైపుణ్యాలను పెంపొందించేందుకు గాను అవసరమైన ఆన్‌లైన్ కోర్సులను ఆఫర్ చేయనున్నట్లు ఐబీఎం తెలిపింది. ఓపెన్ పీ-టెక్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా టాస్క్‌కు ఈ కోర్సులను అందించనున్నట్లు పేర్కొంది. ఏడాది కాలంలో ఇంజనీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్ కోర్సుల్లోని మొత్తం 30 వేల మంది విద్యార్ధులు ఈ కోర్సుల ద్వారా లబ్ధి పొందుతారని వెల్లడించింది.
Updated Date - 2020-12-15T06:48:37+05:30 IST