ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టై గ్లోబల్‌ సదస్సుకు హైదరాబాద్‌ ఆతిథ్యం

ABN, First Publish Date - 2020-08-20T06:15:19+05:30

ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టై) గ్లోబల్‌ సమావేశానికి టై హైదరాబాద్‌ చాప్టర్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబరు 8-10 తేదీల్లో వర్చ్యువల్‌గా ఈ సదస్సు జరగనుందని.. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే వీలుందని టై హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ పిన్నపురెడ్డి తెలిపారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ద ఇండస్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ (టై) గ్లోబల్‌ సమావేశానికి టై హైదరాబాద్‌ చాప్టర్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబరు 8-10 తేదీల్లో వర్చ్యువల్‌గా ఈ సదస్సు జరగనుందని.. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే వీలుందని టై హైదరాబాద్‌ ప్రెసిడెంట్‌ శ్రీధర్‌ పిన్నపురెడ్డి తెలిపారు. 25 దేశాలకు చెందిన 20 వేల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, సెలబ్రిటీలు, ప్రముఖ క్రీడాకారులు తదితరులు ఇందులో పాలుపంచుకోనున్నారు. దాదాపు 250 స్టార్ట్‌పలకు 200 మంది గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ఈ సదస్సులో నిధులు అందించవచ్చని టై గ్లోబల్‌ చైర్మన్‌ మహావీర్‌ శర్మ చెప్పారు. సత్య నాదెళ్ల, రతన్‌ టాటా, ఆనంద్‌ మహీంద్రా తదితర ప్రముఖలతో పాటు దేశాధినేతలు కూడా ఇందులో పాల్గొంటారు. అమెరికా, యూరప్‌ అఫ్రికా సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 20 టై చాప్టర్లు ఈ సదస్సులో పాలుపంచుకుంటాయి. 

Updated Date - 2020-08-20T06:15:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising