ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

GSTR-3B నిల్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయటం ఎలా ?

ABN, First Publish Date - 2020-06-21T05:56:54+05:30

జీఎస్‌టీ కింద రిజిస్టర్‌ అయిన ప్రతి ఒక్కరు (కాంపోజిషన్‌ స్కీమ్‌ లాంటివి తప్ప) GSTR-3B రిటర్న్‌ దాఖలు చేయాలి. సాధారణంగా GSTR-3B రిటర్న్‌లో ఆ నెలకు సంబంధించిన టర్నోవర్‌ దాని మీద చెల్లించాల్సిన పన్ను వివరాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీఎస్‌టీ కింద రిజిస్టర్‌ అయిన ప్రతి ఒక్కరు (కాంపోజిషన్‌ స్కీమ్‌ లాంటివి తప్ప) GSTR-3B రిటర్న్‌ దాఖలు చేయాలి. సాధారణంగా GSTR-3B రిటర్న్‌లో ఆ నెలకు సంబంధించిన టర్నోవర్‌ దాని మీద చెల్లించాల్సిన పన్ను వివరాలు, పొందిన ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌, రివర్స్‌ చార్జ్‌ మెకానిజంలో ఏదేనీ సరఫరాలు పొందితే వాటి వివరాలు లేదా ఇంతకు ముందు రిటర్న్‌ దాఖలు చేసి వివరాలను సరిగ్గా పొందుపరచకపోతే వాటికి సంబంధించిన వివరాలు ఇంకా ఏదైనా సందర్భంలో ఇన్‌పుట్‌ టాక్స్‌ క్రెడిట్‌ను రివర్స్‌ చేయాల్సి వస్తే వాటి వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. అయితే కొవిడ్‌-19 వల్ల కావచ్చు.. వేరే ఇతర కారణాలతోనో ఎవరికైనా వ్యాపారం అసలు జరగకపోవచ్చు. అలాగే పై వివరాలేవీ తాను నింపాల్సిన అవసరం లేదనుకుందాం. అలాంటప్పుడు ‘నిల్‌’ రిటర్న్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. అంటే వ్యాపారం లేదని రిటర్న్‌ దాఖలు చేయకుండా ఉండకూడదు. ఒకసారి జీఎస్‌టీ కింద రిజిస్ట్రేషన్‌ తీసుకున్న తర్వాత తప్పనిసరిగా రిటర్న్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.వ్యాపారం ఉంటే సంబంధిత వివరాలతో లేకుంటే ఎలాంటి వివరాలు లేకుండా నిల్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయాల్సి ఉంటుంది. 


అయితే, చాలా మంది చిన్న, చిరు వ్యాపారస్తులకు దీని మీద అవగాహన ఉండదు. నిల్‌ రిటర్న్‌ కోసం కూడా ఎవరైనా అకౌంటెంట్‌ మీద ఆధారపడాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జీఎ్‌సటీ మండలి కేవలం నిల్‌ రిటర్న్‌ మాత్రమే దాఖలు చేయాల్సిన సందర్భంలో మొబైల్‌ నుంచి దాఖలు చేసే విధంగా ఒక సులభమైన విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం ఎస్‌ఎంఎస్‌ (SMS) పంపటం ద్వారా నిల్‌ రిటర్న్‌ను సులభంగా దాఖలు చేయవచ్చు. దీనికి ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఎవరికి వారే స్వయంగా చేసుకోవచ్చు. ముందుగా జీఎస్‌టీ (GST) వివరాల ప్రకారం ఉన్న మీ మొబైల్‌ నంబర్‌ను మాత్రమే దీని కోసం వాడాలి. దీన్ని రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ అంటారు. అలాగే మీ GST సంఖ్య, మీరు నిల్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయాల్సిన నెలను సరి చూసుకోవాలి. ఎస్‌ఎంఎ్‌సను 14409 అనే నంబరుకు కింది విధంగా పంపించాలి.


NIL<space>3B<space>GSTIN<space>Return Period

రిటర్న్‌ పీరియడ్‌ అంటే మీరు ఫైల్‌ చేయాల్సిన నెల దీనిని MMYYYY ఫార్మాట్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. స్పేస్‌ అని ఉన్న దగ్గర ఖాళీ ఉంచాలి. ఉదాహరణకు మీ GST నంబర్‌ 36ABCDE1234H4Z6, ఏప్రిల్‌ 2020కి గాను రిటర్న్‌ చేయాలనుకుంటే NIL 3B 36ABCDE1234H4Z6 042020 అని టైప్‌ చేసి 14409 నంబరుకు మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ పంపాలి.  అప్పుడు మీకు ఆరు అంకెల వెరిఫికేషన్‌ కోడ్‌ (VERIFICATION CODE) వస్తుంది. అప్పుడు తిరిగి అదే మొబైల్‌ నుంచి CNF<space>3B<space>Codeను అదే 14409కు పంపాలి. ఉదాహరణకు మీకు 123456 అనే వెరిఫికేషన్‌ కోడ్‌ వచ్చిందనుకుందాం. అప్పుడు మీ మొబైల్‌ నుంచి CNF 3B 123456  అని టైప్‌ చేసి 14409కు పంపితే నిల్‌ రిటర్న్‌ ఫైల్‌ అయినట్లుగా మెసేజ్‌ వస్తుంది. ఒకవేళ ఎక్కడైనా పొరపొటు ఉంటే ఎర్రర్‌ రిపోర్ట్‌ వస్తుంది. ఈ విధంగా నిల్‌ రిటర్న్‌ను సులభంగా దాఖలు చేయవచ్చు.  

గమనిక: ఈ వ్యాసాల ద్వారా ఇస్తున్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పాఠకులు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత చట్టాలు/నిబంధనలను కూలంకషంగా పరిశీలించాలి. 

Updated Date - 2020-06-21T05:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising