ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్లోకి హింద్‌వేర్‌ స్నోక్రెస్ట్‌ సీలింగ్‌ ఫ్యాన్లు

ABN, First Publish Date - 2020-03-05T06:18:47+05:30

హింద్‌వేర్‌ అప్లయెన్సె్‌సను తయారు చేస్తున్న సోమని హోమ్‌ ఇన్నోవేషన్‌ లిమిటెడ్‌ ‘హింద్‌వేర్‌ స్నోక్రెస్ట్‌’ బ్రాండ్‌ కింద సీలింగ్‌ ఫ్యాన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రీమియం, డెకొరేటివ్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హింద్‌వేర్‌ అప్లయెన్సె్‌సను తయారు చేస్తున్న సోమని హోమ్‌ ఇన్నోవేషన్‌ లిమిటెడ్‌ ‘హింద్‌వేర్‌ స్నోక్రెస్ట్‌’ బ్రాండ్‌ కింద సీలింగ్‌ ఫ్యాన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రీమియం, డెకొరేటివ్‌, క్లాసిక్‌ కేటగిరీల కింద ఆరు మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరల శ్రేణి రూ.1,499 నుంచి రూ.2,999 వరకు ఉంది. బుధవారంనాడిక్కడ వీటిని విడుదల చేసిన సందర్భంగా సోమని హోమ్‌ ఇన్నోవేషన్‌ సీఈఓ, హోల్‌టైమ్‌ డైరెక్టర్‌ రాకేష్‌ కౌల్‌ మాట్లాడుతూ.. వచ్చే మూడు నాలుగు నెలల్లో టేబుల్‌ ఫ్యాన్లు, ఎగ్జాస్ట్‌, వాల్‌ ఫ్యాన్లను కూడా మార్కెట్లోకి తెస్తామన్నారు. ప్రస్తుతం దేశంలో వార్షికంగా 11 కోట్ల సీలింగ్‌ ఫ్యాన్లు అమ్ముడవుతుండగా.. వీటి విలువ రూ.8,000 కోట్ల వరకు ఉందని, 2022 సంవత్సరం వరకు ఈ మార్కెట్‌ రూ.12,900 కోట్లకు చేరుకునే అవకాశం 


ఉందని పేర్కొన్నారు. మూడునాలుగేళ్ల కాలంలో ఫ్యాన్ల మార్కెట్లో ఐదు శాతం మార్కెట్‌ వాటాను లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వినియోగదారుల నుంచి సమాచారం తెలుసుకుని తాము సీలింగ్‌ 


ఫ్యాన్ల కేటగిరీలోకి ప్రవేశించామని, ఈ మార్కెట్లో అపార అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు సోమని హోమ్‌ ఇన్నోవేషన్‌ టర్నోవర్‌ రూ.530-540 కోట్లకు 


చేరుకోవచ్చన్నారు. వచ్చే ఐదేళ్ల కాలంలో కంపెనీ వ్యాపారంలో ఫ్యాన్ల వ్యాపార వాటా 10 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నామని చెప్పారు. 

Updated Date - 2020-03-05T06:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising