ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెరిటేజ్‌ డివిడెండ్‌ 50%

ABN, First Publish Date - 2020-05-28T08:54:09+05:30

వాటాదారులకు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2.5 (50%)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • త్రైమాసిక ఆదాయం రూ.791 కోట్లు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వాటాదారులకు మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.2.5 (50%) డివిడెండ్‌ను హెరిటేజ్‌ ఫుడ్స్‌ కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. 28న జరిగే సర్వసభ్య సమావేశంలో వాటాదారుల అనుమతి మేరకు డివిడెండ్‌ చెల్లించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఏకీకృత ప్రాతిపదికన గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి రూ.210 కోట్ల నష్టాన్ని చవి చూసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి రూ.20.16 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. సమీక్ష త్రైమాసికానికి కంపెనీ మొత్తం ఆదాయం రూ.706 కోట్ల నుంచి రూ.791 కోట్లకు పెరిగింది. 2019-20 ఏడాదికి రూ.3,029 కోట్ల ఆదాయంపై రూ.169.40 కోట్ల నష్టాన్ని ప్రకటించినట్లు కంపెనీ వెల్లడించింది.


అంతక్రితం ఏడాదిలో ఆదాయం రూ.2,655 కోట్లు, లాభం రూ.82.59 కోట్ల మేరకు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో డెయిరీ వ్యాపారంలో 8.4 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బ్రహ్మణి నారా తెలిపారు. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టడం.. మరింత మంది వినియోగదారులను ఆకర్షించడం డెయిరీ వ్యాపారం పెరిగేందుకు దోహదం చేసిందన్నారు. కొన్ని రవాణా ఇబ్బందులు తప్పించి లాక్‌డౌన్‌ ప్రభావం కంపెనీపై లేదన్నారు. 

Updated Date - 2020-05-28T08:54:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising