ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1.6 మిలియన్ల మంది పన్ను చెల్లింపుదారులకు రూ. 26,000 కోట్లు వెనక్కి!

ABN, First Publish Date - 2020-05-23T01:06:40+05:30

ఏప్రిల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 1.6 మిలియన్ల మందికిపైగా పన్ను చెల్లింపుదారులకు రూ. 26,242

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఏప్రిల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 1.6 మిలియన్ల మందికిపైగా పన్ను చెల్లింపుదారులకు రూ. 26,242 కోట్లను వెనక్కి ఇచ్చినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ) తెలిపింది. రిఫండ్స్‌ను వేగవంతం చేయడం, పన్ను చెల్లింపుదారుల ద్రవ్యలభ్యతను మెరుగు పరిచే ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులకు రూ. 14,632 కోట్లు, కార్పొరేట్లకు రూ. 11,610 కోట్లను ప్రభుత్వం వెనక్కి ఇచ్చింది. ఫలితంగా 1.5 మిలియన్ల మందికిపైగా వ్యక్తిగత ఆదాయపన్ను చెల్లింపుదారులు, 1,02,392 మంది కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలిగినట్టు సీబీడీటీ తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల ద్రవ్యతను మెరుగు పరిచేందుకు ట్యాక్స్ రిఫండ్‌ను క్లియర్ చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. 

Updated Date - 2020-05-23T01:06:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising