ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్‌-19పై పోరుకు 800 మిలియన్ డాలర్లు ప్రకటించిన గూగుల్

ABN, First Publish Date - 2020-03-30T02:48:25+05:30

కోవిడ్-19పై పోరుకు సెర్జింజన్ దిగ్గజం గూగుల్ ముందుకొచ్చింది. చిన్న, మధ్యతరహా వ్యాపారులు (ఎస్‌ఎంబీస్),

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా: కోవిడ్-19పై పోరుకు సెర్జింజన్ దిగ్గజం గూగుల్ ముందుకొచ్చింది. చిన్న, మధ్యతరహా వ్యాపారులను (ఎస్‌ఎంబీస్) ఆదుకునేందుకు,  ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తలు కరోనాపై చేస్తున్న పోరుకు గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అండగా నిలిచారు. ఇందుకోసం 800 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.5,990) కోట్లు ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా ప్రభుత్వ సంస్థలకు 250 మిలియన్ డాలర్ల (సుమారు రూ.1,872 కోట్లు) యాడ్ గ్రాంట్స్‌ను గూగుల్ అందిస్తుందని సుందర్ పిచాయ్ తెలిపారు. 


కమ్యూనిటీ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్లు, ఎన్జీవోలకు ప్రకటన గ్రాంట్లలో 20 మిలియన్ డాలర్లు ఇవ్వనుండగా, గూగుల్ యాడ్స్ క్రెడిట్స్‌లో 340 మిలియన్ డాలర్లు గత సంవత్సర కాలంగా క్రియాశీలక ఖాతాలతో ఉన్న అన్ని ఎస్ఎంబీలకు అందుబాటులో ఉంచనుంది. చిరువ్యాపారులను ఆదుకునే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్జీవోలు, ఫైనాన్షియల్ సంస్థలకు 200 మిలియన్ డాలర్ల పెట్టబడి నిధిని ప్రకటించింది. కోవిడ్-19 మహమ్మారిపై అధ్యయనం చేసేందుకు విద్యాసంస్థలు, పరిశోధకులకు గూగుల్ క్లౌడ్‌లో 20 మిలియన్ డాలర్లను అందిస్తోంది. అలాగే, రాబోయే కొన్ని వారాల్లో 2 నుంచి మూడు మిలియన్ల ఫేస్‌మాస్క్‌లను ఉత్పత్తి చేసేందుకు మాజిడ్ గ్లోవ్స్ అండ్ సేఫ్టీతో కలిసి గూగుల్ పనిచేస్తోంది. 

Updated Date - 2020-03-30T02:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising