ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

79 శాతం పెరిగిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంపద

ABN, First Publish Date - 2020-09-29T21:44:15+05:30

గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ సంపద 79 శాతం పెరిగి రూ. 5900 కోట్లకు చేరుకుంది. ఐఐఎఫ్ఎల్ తాజాగా విడుదల చేసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ సంపద 79 శాతం పెరిగి రూ. 5900 కోట్లకు చేరుకుంది. ఐఐఎఫ్ఎల్ తాజాగా విడుదల చేసిన టాప్-10  రిచ్చెస్ట్ ఇండియన్ ప్రొఫెషనల్ మేనేజర్స్ జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో కలిసి పిచాయ్ ఐదో స్థానాన్ని పంచుకున్నారు. సత్యనాదెళ్ల సంపద 16 శాతం పెరిగి రూ.5,900 కోట్లకు పెరిగింది.


ఈ జాబితాలో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన సంపద 7 శాతం పెరిగి రూ.11,300 కోట్లకు చేరుకుంది. కురియన్ గూగుల్ క్లౌడ్‌లో చేరకముందు ఒరాకిల్‌లో పనిచేశారు. అరిస్టా నెట్‌వర్క్స్  సీఈవో జయశ్రీ ఉల్లాల్ (రూ.9,100 కోట్లు), మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్‌పాల్ సింగ్ బంగా (రూ.7,200 కోట్లు), పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌ సీఈవో నికేశ్ అరోరా (రూ.6,500 కోట్లు) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. 


రూ. 4,500 కోట్లతో అడోబ్ సీఈవో శంతనునారాయణ్ , రూ.3,500 కోట్లతో పెప్సికో సీఈవో ఇంద్రానూయి ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉండగా, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌కు చెందిన ఇగ్నాటియస్ నావిల్ నోరోన్హా (రూ.3,200), హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన ఆదిత్యపూరి (రూ.1,300 కోట్లు) 9, 10 స్థానాల్లో ఉన్నారు. 

Updated Date - 2020-09-29T21:44:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising