ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తగ్గిన బంగారం, వెండి ధరలు

ABN, First Publish Date - 2020-09-18T23:39:54+05:30

దేశీయంగా బంగారం, వెండి ధరలు ఒక శాతానికి పైగా తగ్గాయి. వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు తక్కువగానే ఉంచుతామని యూఎస్ సెంట్రల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: దేశీయంగా బంగారం, వెండి ధరలు ఒక శాతానికి పైగా తగ్గాయి. వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు తక్కువగానే ఉంచుతామని  యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించడంతో డాలర్ పుంజుకుంది. అయితే, ఇతర కరెన్సీలో లావాదేవీలు జరిపే వారికి మాత్రం పసిడి మరింత ప్రియమైంది. మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్ (ఎంసీఎక్స్) గోల్డ్ ఫీచర్స్ (అక్టోబరు 5 సెటిల్‌మెంట్) 1.10 శాతం (రూ.572) తగ్గి రూ. 51,252 వద్ద ముగియగా, వెండి 2.71 శాతం తగ్గి రూ.66,919 వద్ద ముగిసింది. 


అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం (కామెక్స్) ఔన్స్‌కు 1.64 శాతం క్షీణించి 1,938.20 డాలర్లుగా నమోదైంది. అదే సమయంలో ఔన్స్ వెండి ధర 3.89 శాతం తగ్గి  26.41కు పడిపోయింది.  ఇక దేశీయంగా స్పాట్ గోల్డ్ 10 గ్రాములకు రూ.51,511గా ఉండగా, కిలో వెండి ధర రూ. 65,218గా ఉంది. దీనికి జీఎస్టీ అదనమని ముంబైకి చెందిన ఇండియన్ బులియన్ అండన్ జెవెల్లర్స్ అసోసియేషన్ తెలిపింది.  

 

Updated Date - 2020-09-18T23:39:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising