ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెండి జిలుగులు

ABN, First Publish Date - 2020-08-08T06:19:57+05:30

బంగారం, వెండి ధరలు రోజురోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఆల్‌టైమ్‌ హై రూ.57,008 స్థాయికి చేరింది. బంగారం ధరలు వరుసగా పదహారు రోజుల నుంచి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కేజీ ధర రూ.77,840 స్థాయికి చేరిక 
  • అదే బాటలో పసిడి 
  • రోజురోజుకు సరికొత్త రికార్డులు నమోదు

న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు రోజురోజుకు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఆల్‌టైమ్‌ హై రూ.57,008 స్థాయికి చేరింది. బంగారం ధరలు వరుసగా పదహారు రోజుల నుంచి పెరుగుతూ వస్తుండటం గమనార్హం. కాగా కేజీ వెండి ధర కూడా ఏకంగా రూ.77,840 స్థాయిని తాకింది. అంతర్జాతీయంగా ఔన్స్‌ బంగారం ధర 2,075 డాలర్లు, ఔన్స్‌ వెండి 28.36 డాలర్ల స్థాయిని తాకటంతో దేశీయంగా ధరలు పెరిగాయని నిపుణులంటున్నారు. 


కరోనా వైరస్‌ రిలీఫ్‌ ప్యాకేజీపై అనిశ్చితి, అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండటం కూడా పసిడి, వెండి ధరలు పెరగటానికి కారణాలుగా ఉన్నాయి. మరోవైపు ముం బై బులియన్‌ మార్కెట్లో 24 క్యారట్లతో కూడిన 10 గ్రాముల పసిడి ధర రూ.212 పెరిగి రూ.56,126 వద్ద ముగియగా కేజీ వెండి ధర ఏకంగా రూ.1,396 పెరిగి రూ.75,103కి చేరింది. ఇక హైదరాబాద్‌ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.58,330గా ఉండగా వెండి కేజీ ధర రూ.73,500గా ఉంది. భారత మార్కెట్లో బంగారం ధర ఈ ఏడాది ఇప్పటి వరకు 40 శాతం పెరగగా వెండి ధర 65 శాతం వరకు పెరిగింది. వెండి ధర మూడు వారాల్లోనే 45 శాతం వరకు పెరగటం గమనార్హం. ధరల పెరుగుదలకు ప్రస్తుతం సానుకూల పరిస్థితులున్నప్పటికీ దీర్ఘకాలంలో ఈ ర్యాలీ కొనసాగుతుందా అనేది చెప్పటం కష్టమని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటం మంచిదని నిపుణులంటున్నారు.


Updated Date - 2020-08-08T06:19:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising