ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్యూ1లో రెండంకెల తిరోగమనం: డీబీఎస్‌

ABN, First Publish Date - 2020-07-08T06:09:51+05:30

కొవిడ్‌-19 కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికం (క్యూ1)లో రెండంకెల స్థాయి తిరోగమనం చవిచూడవచ్చని డీబీఎస్‌ అంచనా వేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో 3.1 శాతం వృద్ధి రేటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కొవిడ్‌-19 కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికం (క్యూ1)లో రెండంకెల స్థాయి తిరోగమనం చవిచూడవచ్చని డీబీఎస్‌ అంచనా వేసింది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థలో 3.1 శాతం వృద్ధి రేటు నమోదైంది. కరోనా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని జీడీపీని వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా మదింపు చేసేందుకు తమ పరిశోధన విభాగం నౌ కాస్టింగ్‌ మోడల్‌ అనుసరిస్తున్నదని, దాని ప్రకారం రెండో త్రైమాసికంలో రెండంకెల తిరోగమనం నమోదు కావచ్చుని తాజా నివేదికలో తెలిపింది.  అయితే ఆర్థిక సంవత్సరం చివరికి మాత్రమే వృద్ధి రేటు సాధారణ స్థాయికి రావచ్చని, ఏడాది మొత్తం మీద అది మైనస్‌ 4.8 శాతం ఉండవచ్చని  డీబీఎస్‌ బ్యాంక్‌ ఆర్థికవేత్త రాధికా రావు అన్నారు. ఈ మహమ్మారిని అదుపు చేయడంలో జరుగుతున్న జాప్యం కారణంగా తమ అంచనా కన్నా వాస్తవ వృద్ధి 1 నుంచి 1.5 శాతం మేరకు దిగజారే ప్రమాదం కూడా ఉంటుందని తెలిపారు.  


Updated Date - 2020-07-08T06:09:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising