ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణలో పెరిగిన డిమాండ్‌

ABN, First Publish Date - 2020-03-30T08:55:31+05:30

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వంటగ్యాస్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. సాధారణ రోజుల్లో వినియోగం కంటే ఇప్పుడు 25 శా తం ఎక్కువ వాడుతున్నారు. గతంలో రోజుకు గరిష్ఠంగా 4 లక్షల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • గ్యాస్‌ సరఫరా సిబ్బందికి నేటి నుంచి పాస్‌లు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వంటగ్యాస్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. సాధారణ రోజుల్లో వినియోగం కంటే ఇప్పుడు 25 శా తం ఎక్కువ వాడుతున్నారు. గతంలో రోజుకు గరిష్ఠంగా 4 లక్షల సిలిండర్లు బుకింగ్‌లు పెండింగ్‌లో ఉండేవి. ప్రస్తుతం అది ఏకంగా 8 లక్షలకు పెరిగింది. దీంతో సరఫరాలో కూడా కాస్త జాప్యం జరుగుతోంది. ఇదివరకు రాష్ట్రంలో రోజుకు 1.80 లక్షల నుంచి 2 లక్షల సిలిండర్లు సరఫరా అయ్యేవి. ప్రస్తుతం రోజుకు 2.40 లక్షలు సరఫరా అవుతున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే 25ు గ్యాస్‌ వినియోగం, 50 శాతం బుకింగ్‌లు పెరిగాయని, అయినప్పటికీ వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్యాస్‌ సరఫరా చేస్తున్నామని రాష్ట్ర ఎల్‌పీజీ డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. 

మూడు ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీల డెలివరీ బాయ్స్‌, ప్లాంటు స్టాఫ్‌, ఆఫీస్‌ స్టాఫ్‌, డ్రైవర్లు, అసిస్టెంట్లు అందరికీ పాస్‌లు జారీచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి పాస్‌లు పంపిణీ చేయనున్నారు. 


ఆన్‌లైన్‌లో కన్జ్యూమర్‌ ఎలకా్ట్రనిక్స్‌ సేవలు  

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎటూవెళ్లలేని పరిస్థితి ఉన్న కారణంగా అప్లయెన్సెస్‌, కన్జ్యూమర్‌ ఎలక్ర్టానిక్‌ ఉత్పత్తుల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇ లాంటి వారికి సోషల్‌ మీడియా, ఇతర ఆన్‌లైన్‌ సాధనాల ద్వారా కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. సోనీ, సామ్‌సంగ్‌, పానసోనిక్‌, హేయర్‌, గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ వంటి కంపెనీలు లైవ్‌ చాట్‌, వాట్సప్‌, డీఐవై వీడియో, ఆన్‌కాల్‌ అసిస్టెన్స్‌ వంటి ద్వారా కస్టమర్లకు  అవసరమైన సేవలను అందిస్తున్నాయి. 


Updated Date - 2020-03-30T08:55:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising