ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్చి వరకు ఉచిత రేషన్... ?

ABN, First Publish Date - 2020-10-27T01:47:50+05:30

కేంద్రం త్వరలో ప్రకటించనున్నట్లగా వినవస్తోంన్న ఆర్ధిక ప్యాకేజీపై అన్ని వర్గాలూ ద‌ృష్టి సారించాయి. లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో ప్రకటించిన భారీ ప్యాకేజీ, ప్రయోజనాలు దాదాపు ముగిశాయి. ఈ క్రమంలో... రెండో ప్యాకేజీ అవసరమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వ్యాపార విశ్వాసాలు ఇంకా అస్థిరంగానే ఉన్నాయని చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కేంద్రం త్వరలో ప్రకటించనున్నట్లగా వినవస్తోంన్న ఆర్ధిక ప్యాకేజీపై అన్ని వర్గాలూ ద‌ృష్టి సారించాయి. లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోన్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో ప్రకటించిన భారీ ప్యాకేజీ, ప్రయోజనాలు దాదాపు ముగిశాయి. ఈ క్రమంలో... రెండో ప్యాకేజీ అవసరమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.


వ్యాపార విశ్వాసాలు ఇంకా అస్థిరంగానే ఉన్నాయని చెబుతున్నారు. కాగా... ప్రభుత్వోద్యోగులకు ఇటీవల ప్రకటించిన ఎల్టీసీ, బోనస్... డిమాండ్ పునరత్తేజానికి అతి స్వల్పంగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు. కాగా వ్యాపారులు దీపావళిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక పండుగ తర్వాత మళ్లీ డిమాండ్-లేమి

భారీ పతనం.. ప్రభుత్వం ఏం చేయనుంది ? 

2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ భారీగా పతనమవుతుందని రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేశాయి. మైనస్ 11.5 శాతంగా ఉంటుందని మూడీస్, మైనస్ 10.5 శాతంగా ఉంటుందని ఫిచ్, మైనస్ 10.3 శాతంగా ఉంటుందని ఐఎంఎఫ్, మైనస్ 9.3 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్, మైనస్ 9.5 శాతంగా ఉండవచ్చునని ఆర్‌బీఐ, మైనస్ 9 శాతంగా ఉండవచ్చునని ఎస్ అండ్ పీ అంచనా వేశాయి. 


ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో ప్యాకేజీని ప్రకటిస్తే... తదుపరి ఉద్దీపనలు ఎలా ఉంటాయన్న విషయమై ఆయా వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. మార్చి 2021 వరకు ఉచిత రేషన్ అందించే అవకాశాలుండవచ్చని ఆర్థికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.


ఇక... నగర పేదలకు మద్దతుగా ప్యాకేజీ ప్రకటించే అవకాశాలుటాయని భావిస్తున్నారు. మరోవైపు... డిమాండ్ పెంచే లక్ష్యంలో భాగంగా ఆదాయపు పన్ను ప్రయోజనాలను కల్పించే అవకాశాలు లేకపోలేదని కూడా భావిస్తున్నారు. 


ఇక మొబైల్ ఫోన్లు, సిమెంట్, వాహనానలు, వాటి సంబంధిత ఉత్పత్తుల విడిభాగాలపై జీఎస్టీని తగ్గించవచ్చని సమాచారం. షార్ట్ వ్యాలిడిటీ పీరియడ్‌తో నాన్ రీఫండబుల్ కన్సంప్షన్ వోచర్ జారీ చేయవచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.


Updated Date - 2020-10-27T01:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising