ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెరగనున్న ఫీచర్ ఫోన్ ధరలు

ABN, First Publish Date - 2020-02-02T02:59:13+05:30

ఫీచర్ ఫోన్ ధరలకు రెక్కలు రానున్నాయి. మొబైల్ ఫోన్లలో ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఫీచర్ ఫోన్ ధరలకు రెక్కలు రానున్నాయి. మొబైల్ ఫోన్లలో ఉపయోగించే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ (పీసీబీఏ)పై ప్రభుత్వం 20 శాతం కస్టమ్స్ సుంకం విధిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ  సుంకం పది శాతంగా ఉంది. ఇప్పుడది రెట్టింపు కావడంతో ఆ మేరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. దేశీయంగా వీటి ఉత్పత్తులను పెంచే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 


ప్రస్తుతం దేశంలో ఏడాదికి 300 మిలియన్ పీసీబీఏ యూనిట్లు వినియోగంలోకి వస్తున్నాయి. వీటిలో 160 మిలియన్ యూనిట్లను స్మార్ట్‌ఫోన్లలో వాడుతున్నారు. ఇవన్నీ స్థానికంగానే ఉత్పత్తి అవుతుండగా, ఫీచర్ ఫోన్లలో ఉపయోగిస్తున్న వాటిని దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పుడు వాటి దిగుమతి సుంకం పెరగడంతో ఆ మేరకు ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 


అయితే, దేశీయ యూనిట్లు పీసీబీఏల ఉత్పత్తిని కనుక ప్రారంభిస్తే వాటి ధర తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. స్థానిక తయారీదారులు ఉత్పత్తి చేస్తున్న పీసీబీఏల విలువ లక్ష కోట్ల రూపాయలు కాగా, దిగుమతి చేసుకుంటున్న వాటి విలువ రూ.6 వేల కోట్లు కావడం గమనార్హం.

Updated Date - 2020-02-02T02:59:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising