ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదరగొట్టిన ఐఓసీ

ABN, First Publish Date - 2020-10-31T06:53:29+05:30

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) నికర లాభం ఏకంగా పదకొండు రెట్లు పెరిగి రూ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యూ2లో 11  రెట్లు పెరిగిన లాభం 

న్యూఢిల్లీ : సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) నికర లాభం ఏకంగా పదకొండు రెట్లు పెరిగి రూ.6,237.31 కోట్లుగా నమోదైంది. రిఫైనింగ్‌ మార్జిన్లు పెరగటం, ఇన్వెంటరీ లాభాలు ఈ త్రైమాసికంలో కంపెనీకి ఎంతగానో కలిసివచ్చాయి. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.563.42 కోట్లుగా ఉంది. మే, జూన్‌ నెలల్లో తక్కువ ధరకే కొనుగోలు చేసిన క్రూడాయిల్‌ను పెట్రోలియం ఉత్పత్తుల్లోకి మార్చటంతో దాదాపు రూ.7,400 కోట్లను కంపెనీ ఆర్జించింది.


సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం మాత్రం రూ.1.32 లక్షల కోట్ల నుంచి రూ.1.15 లక్షల కోట్లకు పడిపోయింది. కాగా ఇంధన విక్రయాలు జూన్‌ త్రైమాసికంతో పోల్చితే 16 శాతం పెరిగాయి. అయితే గత ఏడాది ఇదే త్రైమాసికంతో చూస్తే మాత్రం 12 శాతం తగ్గాయి. మరోవైపు ప్రస్తు త ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్స్‌ లేదా డిబెంచర్ల జారీ ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించేందుకు ఐఓసీ బోర్డు ఆమోదం తెలిపింది. 


Updated Date - 2020-10-31T06:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising