ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాదిలో 700 % జంప్... బెజోస్‌ను దాటివేసే దిశగా ఎలాన్...

ABN, First Publish Date - 2020-12-20T20:07:38+05:30

టెస్లా స్టాక్స్ 2020 క్యాలెండర్ ఏడాదిలో భారీ లాభాలు నమోదు చేయడంతో గత నెల నాటికి ఈ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్(49) సంపద 100 బిలియన్ డాలర్లకు పైగా పెరిగి 160 బిలియన్ డాలర్లు దాటింది. ఈ క్రమంలో... ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యాలిఫోర్నియా : టెస్లా స్టాక్స్ 2020 క్యాలెండర్ ఏడాదిలో భారీ లాభాలు నమోదు చేయడంతో గత నెల నాటికి ఈ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్(49) సంపద 100 బిలియన్ డాలర్లకు పైగా పెరిగి 160 బిలియన్ డాలర్లు దాటింది. ఈ క్రమంలో... ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకారు. 


జనవరిలో బ్లూమ్‌బర్గ్ ప్రకటించిన ప్రపంచ 500 మిలియనీర్లలో అతను 35 వ స్థానంలో నిలిచారు. కొద్ది నెలల క్రితం టాప్ 10 లోకి వచ్చారు. నవంబరు నెలలో టాప్ 3 కి, ఆ తర్వాత 2 వ స్థానంలోకి వచ్చారు. 


కిందటి శుక్రవారం ఒక్కరోజే ఎలాన్ మస్క్ సంపద తొమ్మిది బిలియన్ డాలర్లు పెరరగడం విశేషం. మొత్తంమీద ఈ ఏడాది మస్క్ సంపద 140 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. ఇక టెస్లా షేర్‌కు ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్‌లో స్థానం లభించనుందనే వార్తలతో ఆ స్టాక్ నవంబరు నుండి భారీగా పెరుగుతూ వస్తోంది. ఈ కాలంలోనే 70 శాతం పెరిగింది. ఇక ఏడాదిలో 700 శాతానికి పైగా పెరిగింది. 


 గత గురువారం నాటికి టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్ 621.73 బిలియన్ డాలర్లుగా నమోదైంది. టయోటా మోటార్ కార్ప్ మార్కెట్ క్యాప్ కంటే ఇది 25 బిలియన్ డాలర్లు ఎక్కువ. కరోనా ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా టెస్లా స్టాక్స్ పుంజుకోవడం గమనార్హం. 


ప్రస్తుతం ప్రపంచ కుబేరుడు, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఆస్తులు 187.3 బిలియన్ డాలర్లు కాగా... ఎలాన్ మస్క్ ఆయన సమీపానికి చేరుకున్నాడు. మరో 20 బిలియన్ డాలర్లు పెరిగితే జెఫ్ బెజోస్‌ను అధిగమించి మొదటి స్థానానికి చేరుకుంటారు. 

Updated Date - 2020-12-20T20:07:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising