ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కొరడా... ఆ ప్రాంతంలో 8 కోట్ల ఉద్యోగాల గల్లంతు...

ABN, First Publish Date - 2020-12-17T16:12:56+05:30

కరోనా నేపధ్యంలో ఒక్క ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 81 మిలియన్ల మంది(8.1 కోట్లు) ఉద్యోగాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్‌ఓ) తెలిపింది. కొవిడ్ 19 కారణంగా... ఈ ప్రాంతంలోని ఉద్యోగ మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడిందని అటు సంస్థలు, ఇటు కార్మికులకు... నిలదొక్కుకునేందుకు సాయం సాధ్యం కాలేదని ఐఎల్‌ఓ ఆసియా పసిఫికి విభాగం రీజినల్ డైరెక్టర్ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కరోనా నేపధ్యంలో ఒక్క ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే  81 మిలియన్ల మంది(8.1 కోట్లు) ఉద్యోగాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్‌ఓ) తెలిపింది. కొవిడ్ 19 కారణంగా... ఈ ప్రాంతంలోని ఉద్యోగ మార్కెట్ పై తీవ్ర ప్రభావం పడిందని అటు సంస్థలు, ఇటు కార్మికులకు... నిలదొక్కుకునేందుకు సాయం సాధ్యం కాలేదని ఐఎల్‌ఓ ఆసియా పసిఫికి విభాగం రీజినల్ డైరెక్టర్ వెల్లడించారు. 


అక్కడే 5 కోట్ల ఉద్యోగాలు... గతేడాదితో పోలిస్తే ఆసియా పసిఫిక్ విభాగంలో ఉద్యోగాలు 4.2 శాతం తగ్గినట్లు ఐఎల్‌ఓ వెల్లడించింది. హిళల్లో ఈ తరుగుదల 4.6 శాతం కాగా, పురుషుల్లో 4 శాతం. ఇక... యువతలో ఎక్కువగా పని గంటలు, ఉద్యోగాలు ప్రభావితమైనట్లు వెల్లడించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో యువత అత్యధికంగా ఉన్నట్లు పేర్కొంది. 


ఇక... కార్మికుల ఆదాయం మొదటి త్రైమాసికంలో 9.9 శాతం తగ్గగా, తర్వాతి త్రైమాసికంలో 3.4 శాతం మేర తగ్గింది. కాగా... దక్షిణాసియాలో స్థానిక ఉద్యోగాల్లో అసమానతలు ఎక్కువగా ఉన్నాయని, కరోనా ముందు పరిస్థితితో పోలిస్తే దాదాపు 50 మిలియన్ల(5కోట్లు) ఉద్యోగాలు ప్రభావితమైనట్లు తెలిపింది. 


ఇక రీజినల్ నిరుద్యోగిత రేటు 2019 లో 4.4 శాతం కాగా, 2020 లో 5.2 శాతం నుండి 5.7 శాతానికి పెరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. నివేదిక ప్రకారం ఏసియా-పసిఫిక్ ప్రాంతంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా పనిగంటలను కోల్పోయారు. మొత్తం ఉపాధి నష్టంలో యువత వాటా 3-18 రెట్లు ఎక్కువగా ఉంది. 


ఆదాయం 10 శాతం డౌన్... నిరుద్యోగం పెరగడంతో, కొత్త ఉద్యోగాల కోసం పోటీ పడటం కూడా ఇబ్బందికరమేనని నివేదిక వెల్లడించింది. ఒకవేళ ఏదైనా ఉద్యోగం దొరికినా కూడా తక్కువ వేతన పనితో మాత్రమే. మొత్తంగా మొదటి మూడు త్రైమాసికాల్లో ఈ ప్రాంతాల్లో కార్మికుల ఆదాయం పది శాతం మేర పడిపోయి ఉంటుందని అంచనా.


Updated Date - 2020-12-17T16:12:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising