ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కారణంగా... డబుల్ డెక్కర్ విమానాలు

ABN, First Publish Date - 2020-11-30T01:20:46+05:30

డబుల్ డెక్కర్ విమానాలు రాబోతున్నాయి. ఇందుకోసం విమానయాన సంస్థలు కోట్లాది రూపాయలను వ్యయం చేయనున్నాయి. అయితే... ప్రయాణీకుల సంఖ్య పెరగడం వల్ల ఆదాయం వస్తుంది కనుక కంపెనీలకు ఇదేమీ భారం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : డబుల్ డెక్కర్ విమానాలు రాబోతున్నాయి. ఇందుకోసం విమానయాన సంస్థలు కోట్లాది రూపాయలను వ్యయం చేయనున్నాయి. అయితే... ప్రయాణీకుల సంఖ్య పెరగడం వల్ల ఆదాయం వస్తుంది కనుక కంపెనీలకు ఇదేమీ భారం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


ప్రస్తుతం విమానాల్లో ఎకానమీ క్లాసులో ప్రయాణించేవారికి లెగ్ రూమ్‌లు పరిమితంగానే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇకపై పరిస్థితి ఇలా ఉండదు. విమానం మొత్తం కూడా... డబుల్ డెక్కర్ సీట్లు మాత్రమే ఉంటాయి. ఇదిలా ఉంటే... విమానాల్లో ‘డబుల్ డెక్కర్’ రానుండడానికి కారణం కరోనానే అంటే ఆశ్చర్యం కలుగక మానదు.


కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విమానాల్లో ఈ కొత్త సీటింగ్ విధానాన్ని తీసుకువస్తున్నారు. ప్రయాణికులమధ్య దూరం ఉండేలా సీటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. డిజైనర్ జాఫ్రీ ఓనీల్‌తో విమానయాన సంస్థలు 2-4-2 కాన్ఫిగరేషన్ సీటింగ్ అందించనున్నాయి.

వాస్తవానికి 1970 నుంచి విమానాల్లోని   సీట్లలో పెద్దగా మార్పుల్లేవు. 


ఎకానమీ సీట్లలో నిద్రించడానికి అవకాశముండదు. కానీ... డబుల్ డెక్కర్ సదుపాయంతో లై ఫ్లాట్ భంగిమలో నిద్రించవచ్చు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన విమానయానాన్నందించడమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత సంస్థలు చెబుతున్నాయి. 


సుదీర్ఘ విమాన ప్రయాణాల్లో నిద్రించడానికి వీలుగా ఉండేలా సీటింగ్ డిజైన్ ఉంటుంది. కాగా... ఏ సీటూ కూడా సాంద్రత కోల్పోకుండా ఉండేలా ప్రయత్నిస్తున్నట్లు విమానయాన సంస్థలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-11-30T01:20:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising