ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెట్ టాప్ బాక్స్ ఉత్పత్తిని భారత్‌కు తరలించేందుకు సిద్ధమైన డిష్ టీవీ

ABN, First Publish Date - 2020-09-16T01:33:19+05:30

సెట్ టాప్ బాక్స్ ఉత్పత్తిని భారత్‌కు తరలిస్తున్నట్టు డిష్ టీవీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సెట్ టాప్ బాక్స్ ఉత్పత్తిని భారత్‌కు తరలిస్తున్నట్టు డిష్ టీవీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మేకిన్ ఇండియాలో భాగంగా ఉత్పత్తి చేసిన తొలి విడత సెట్ టాప్ బాక్స్‌లు సిద్ధమయ్యాయని, మార్కెట్‌కు తరలిస్తున్నట్టు పేర్కొంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం నాటికి తమ ఉత్పత్తిలో 50 శాతాన్ని భారత్‌కు తరలించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు డిష్‌టీవీ చైర్మన్, ఎండీ జవహర్ గోయెల్ తెలిపారు.


మేకిన్ ఇండియాలో భాగస్వామ్యమైనందుకు ఆనందంగా ఉందన్నారు. సెట్‌టాప్ బాక్సులతోపాటు ఇతర పరికరాలను కూడా స్థానికంగానే ఉత్పత్తి చేస్తామని గోయెల్ వివరించారు. అలాగే, భారత్‌లోని రిమోట్ కంట్రోల్ తయారీదారులతోనూ డిష్‌టీవీ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వాటిని కూడా భారత్‌లోనే తయారు చేయాలని యోచిస్తోంది. డిష్ టీవీ బ్రాండ్స్, డి2హెచ్, జింగ్‌లను డిష్‌టీవీ నిర్వహిస్తోంది.

Updated Date - 2020-09-16T01:33:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising