టాటా ట్రస్టులకు ఊరట
ABN, First Publish Date - 2020-12-30T06:43:38+05:30
టాటా గ్రూప్‌లోని మూడు ట్రస్టులకు పెద్ద ఊరట లభించింది. రతన్ టాటా ట్రస్ట్, జేఆర్‌డీ టాటా ట్రస్ట్, దొరాబ్జీ టాటా ట్రస్ట్‌లకు ఐటీ శాఖ
పన్ను మినయింపు సబబే :ఐటీఏటీ
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌లోని మూడు ట్రస్టులకు పెద్ద ఊరట లభించింది. రతన్ టాటా ట్రస్ట్, జేఆర్‌డీ టాటా ట్రస్ట్, దొరాబ్జీ టాటా ట్రస్ట్‌లకు ఐటీ శాఖ గత ఏడాది మార్చిలో పన్ను మినహాయింపు రద్దు చేయడాన్ని ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) కొట్టివేసింది. ఐటీ శాఖ ఉత్తర్వుల్లో ఎలాంటి పసలేదని స్పష్టం చేసింది. మూడు ట్రస్టులు ముమ్మాటికీ వ్యాపార సంస్థలుగా కాకుండా, ట్రస్టులుగానే పని చేస్తున్నట్టు పేర్కొంది.
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ ఈక్విటీలో ఈ ట్రస్టులకు మెజారిటీ వాటా ఉన్నప్పటికీ వాటిని వ్యాపార సంస్థలుగా పరిగణించలేమని తెలిపింది. టాటా గ్రూప్ మాజీ చెర్మన్ సైరస్ మిస్త్రీనీ ఐటీఏటీ తీవ్రంగా తప్పుపట్టింది. తనను చైర్మన్ పదవి నుంచి తప్పించాక ఆయన టాటా ట్రస్టులకు సంబంధించిన పత్రాలను ఐటీ శాఖకు అందించడాన్ని ఆక్షేపించింది.
Updated Date - 2020-12-30T06:43:38+05:30 IST