ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలి దశ పరీక్షల్లో ఒక వ్యక్తికే సమస్య

ABN, First Publish Date - 2020-11-22T06:29:51+05:30

ఆగస్టులో జరిగిన కోవ్యాక్సిన్‌ మొదటి దశ క్లినికల్‌ పరీక్షల్లో ఒక వ్యక్తికి ఆరోగ్య సమస్య తలెత్తిన విషయం నిజమేనని.. దాన్ని 24 గంటల్లోనే సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎ్‌ససీఓ), డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కి తెలియజేశామని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • వ్యాక్సిన్‌కు, వ్యక్తి అనారోగ్యానికి సంబంధం లేదు
  • కోవ్యాక్సిన్‌ పరీక్షలపై భారత్‌ బయో


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఆగస్టులో జరిగిన కోవ్యాక్సిన్‌ మొదటి దశ క్లినికల్‌ పరీక్షల్లో ఒక వ్యక్తికి  ఆరోగ్య సమస్య తలెత్తిన విషయం నిజమేనని.. దాన్ని 24 గంటల్లోనే సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎ్‌ససీఓ), డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కి తెలియజేశామని భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ తెలిపింది. ఈ ప్రతికూల పరిణామంపై క్షుణ్ణంగా విచారణ చేశామని, ఇది వ్యాక్సిన్‌ వల్ల జరిగింది కాదని కంపెనీ పేర్కొంది. మొదటి దశ పరీక్షల సమయంలో కోవ్యాక్సిన్‌ తీసుకున్న ఒక వ్యక్తి అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. దాన్ని సీడీఎ్‌ససీఓ, డీసీజీఐలు బహిరంగం చేయలేదని మీడియాలో కథనాలు రావడంతో భారత్‌ బయోటెక్‌ ఈ మేరకు వివరణ ఇచ్చింది. మార్గదర్శకాలకు అనుగుణంగా క్లినికల్‌ పరీక్షల సమయంలో జరిగిన ప్రతికూల పరిణామాలను ఎతిక్స్‌ కమిటీ, డేటా సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డు, సీడీఎ్‌ససీఓ, డీసీజీఐలకు తెలియజేస్తూనే ఉన్నాం. వ్యక్తి చికిత్సకు అయిన ఖర్చును భరించాం.


వ్యక్తి బాగానే ఉన్నారని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌ల)తో కలిసి భారత్‌ బయోటెక్‌ కోవ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇది పూర్తిగా ఇన్‌యాక్టివేటెడ్‌ నావెల్‌ వ్యాక్సిన్‌. ఆయా కంపెనీల వ్యాక్సిన్లను తీసుకున్నప్పుడు ప్రతికూల పరిణామాలు ఎదురుకావడంతో ఆస్ట్రాజెనెకా, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఈమధ్య మూడో దశ క్లినికల్‌ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేశాయి. భారత్‌ బయోటెక్‌ విషయంలో ఆ విషయాన్ని బహిర్గతం చేయలేదని, మూడో దశ పరీక్షలకు అనుమతి లభించిందని సంబంధిత వర్గాల అభిప్రాయం. కాగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌, కోల్‌కతా వంటి నగరాల్లో మూడోదశ క్లినికల్‌ పరీక్షలకు ఒక్కో నగరంలో 1000-2000 మంది వాలంటీర్లను ఎంపిక చేయాలని భారత్‌ బయోటెక్‌ భావిస్తోంది. కోవ్యాక్సిన్‌పై  మూడో దశ క్లినికల్‌ పరీక్షలను భారత్‌ బయోటెక్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-11-22T06:29:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising