ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎల్‌ అండ్‌ టీకి కరోనా సెగ

ABN, First Publish Date - 2020-10-29T05:57:41+05:30

సెప్టెంబరు త్రైమాసికానికి ఎల్‌అండ్‌టీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.1,410.29 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యూ2లో 45% తగ్గిన లాభం

ఒక్కో షేరుకు రూ.18 డివిడెండ్‌  


న్యూఢిల్లీ:  సెప్టెంబరు త్రైమాసికానికి ఎల్‌అండ్‌టీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.1,410.29 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆర్జించిన రూ.2,551.67 కోట్ల లాభంతో పోలిస్తే 45 శాతం క్షీణించింది. కరోనా దెబ్బకు ఆదాయం తగ్గడం, ఆర్థిక సేవల వ్యాపారంలో ఎన్‌పీఏల కోసం అధిక కేటాయింపులు జరపాల్సి రావడంతోపాటు మెట్రోరైల్‌ సేవల నిలిపివేత లాభాలకు గండి కొట్టిందని ఎల్‌ అండ్‌ టీ పేర్కొంది.  మూడు నెలల్లో కంపెనీ ఆదాయం రూ.31,593.77 కోట్లకు పడిపోయింది. క్రితం ఏడాదిలో ఇదే సమయానికి రాబడి రూ.35,924.89 కోట్లుగా ఉంది. సమీక్షా కాలానికి కంపెనీ వ్యయాలు రూ.29,455.57 కోట్ల స్థాయి నుంచి రూ.32,622.14 కోట్లకు పెరిగా యి. కంపెనీ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.18 ప్రత్యేక డివిడెండ్‌ ప్రకటించింది. 

Updated Date - 2020-10-29T05:57:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising