కరోనా పాలసీలొచ్చాయ్
ABN, First Publish Date - 2020-07-11T06:40:33+05:30
కరోనా ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 29 సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ ఈ మేరకు అనుమతి నిచ్చింది. బీమా సంస్థలు మూడున్నర, ఆరున్నర, తొమ్మిదిన్నర నెలల కాలపరిమితితో
- రూ.5 లక్షల వరకు కవరేజీ
- మూడు కాల పరిమితుల్లో లభ్యం
న్యూఢిల్లీ: కరోనా ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 29 సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ ఈ మేరకు అనుమతి నిచ్చింది. బీమా సంస్థలు మూడున్నర, ఆరున్నర, తొమ్మిదిన్నర నెలల కాలపరిమితితో శుక్రవారం మూడు ప్రత్యేక కరోనా కవచ్ బీమా పాలసీలు ప్రకటించాయి. కవచ్ పాలసీ ప్రత్యేకతలు ప్రకటించాయి.
కరోనా కవచ్ పాలసీ ప్రత్యేకతలు
- సింగిల్ ప్రీమియంతో రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు కరోనా ఖర్చులకు బీమా కవరేజీ
- అదనపు కవరేజీకి రూ.50,000 చొప్పున పెంచుకోవాలి
- దేశవ్యాప్తంగా ఒకే ప్రీమియం. జీఎ్‌సటీ అదనం
- హాస్పిటల్ ఖర్చులు, హోమ్‌కేర్ ట్రీట్మెంట్, ఆయుష్ వైద్య విధానాల ఖర్చులకూ పాలసీలు వర్తిస్తాయి
- హాస్పిటల్లో చేరాక 15 రోజుల వరకు, డిశ్చార్జ్ తర్వాత 30 రోజుల వరకు అయ్యే ఖర్చులకూ వర్తింపు
- బేస్ కవరేజ్‌తో పాటు హాస్పిటల్ డెయిలీ క్యాష్ కవర్ ఎంచుకునే సౌలభ్యం
- పాలసీ తీసుకున్న 15 రోజుల తర్వాతే బీమా కవరేజీ
- వ్యక్తిగత లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు ఎంచుకోవచ్చు
బజాజ్ అలెయాంజ్
- వయసు, బీమా మొత్తం, కాలపరిమితిని బట్టి రూ.447 నుంచి రూ.5,630 ప్రీమియం. జీఎ్‌సటీ అదనం.
- జీఎ్‌సటీ కాకుండా రూ.3 నుంచి రూ.620 ప్రీమియంతో హాస్పిటల్లో రోజువారీ నగదు ఎంచుకునే ఆప్షన్
- 0-35 ఏళ్ల వయసు వారికి జీఎ్‌సటీ గాక, రూ.447 ప్రీమియంతో మూడున్నర నెలల కాలానికి రూ.50,000 బీమా
మ్యాక్స్ బూపా..
- 31-55 మధ్య వయసున్న వారికి రూ.2,200 ప్రీమియంతో రూ.2.5 లక్షల కవరేజీ
- అదే వయసున్న ఇద్దరు పెద్దలు, పిల్లలకు రూ.4,700 ప్రీమియంతో రూ.2.5 లక్షల కవరేజీ
హెచ్డీఎఫ్సీ ఎర్గో
- ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో కరోనా అని తేలాక హాస్పిటల్లో చేరితే అయ్యే వైద్య ఖర్చులకు కవరేజీ
- కోవిడ్‌తో పాటు, ఇతర వ్యాధుల చికిత్సకయ్యే ఖర్చులకూ బీమా కవరేజీ
- రూ2,000 వరకు అంబులెన్స్ ఖర్చులకు కవరేజీ
- వైద్యుల సలహాతో 14 రోజుల వరకు ఇంట్లో ఉండి తీసుకునే ట్రీట్మెంట్ ఖర్చులకూ బీమా వర్తింపు
- ఇన్‌పేషెంట్‌గా ఆయుర్వేద, యోగ, నేచురోపతి, యునానీ, సిద్ధ, హోమియో వైద్య ఖర్చులకూ పాలసీ వర్తింపు
- హాస్పిటల్లో చేరే ముందు 15 రోజుల వరకు కరోనా నిర్దారణ కోసం డాక్టర్ల కన్సల్టేషన్, చెక్‌పలు, వైద్య పరీక్షల కోసం చేసే ఖర్చులకూ పాలసీ వర్తిస్తుంది.
Updated Date - 2020-07-11T06:40:33+05:30 IST