ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా వూహాన్‌లో తెరచుకుంటున్న కార్ల కర్మాగారాలు

ABN, First Publish Date - 2020-03-23T17:22:13+05:30

కరోనా వైరస్ బారి నుంచి కోలుకుంటున్న చైనా దేశంలోని వూహాన్ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వూహాన్ (చైనా): కరోనా వైరస్ బారి నుంచి కోలుకుంటున్న చైనా దేశంలోని వూహాన్ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. హుబే ప్రావిన్సులోని వూహాన్ నగరంతోపాటు ఆయా ప్రాంతాల్లో ఏడు కార్ల తయారీ, వాహనాల విడి భాగాల తయారీ కర్మాగారాలున్నాయి. కరోనా వైరస్ బారి నుంచి వూహాన్ నగరం కోలుకుంటుండటంతో డాంగ్పెంగ్ హోండో ఆటో సోమవారం వెయ్యిమంది కార్మికులను కర్మాగారానికి తీసుకువచ్చింది.


కరోనా వైరస్ ఉద్భవించిన తర్వాత వూహాన్ నగరంలోని ఆటోమోటివ్ పరిశ్రమలను చైనా ప్రభుత్వం మూసివేసింది. కరోనా ప్రభావం వల్ల దెబ్బతిన్న కార్ల పరిశ్రమలను తిరిగి తెరుస్తున్నారు. వూహాన్ నగరంలోని డాంగ్పెంగ్ హోండా ఆటో కంపెనీలో పనిచేసేందుకు వెయ్యిమంది కార్మికులు తిరిగి హాంకౌ రైల్వేస్టేషనుకు రావడంతో వారిని 30 బస్సుల్లో వూహాన్ డెవలప్‌మెంట్ జోన్‌కు తరలించినట్లు చైనా ప్రభుత్వ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. వూహాన్ నగరంలో 500 ఆటోమోటివ్ కాంపోనెంట్ కంపెనీలు ఉండటంతో వీటిల్లో తిరిగి ఉత్పత్తి త్వరలో ప్రారంభిస్తామని చైనా అధికారులు చెప్పారు. కార్ల తయారీ కర్మాగారాల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు అనుమతించినట్లు చైనా వర్గాలు వెల్లడించాయి. 

Updated Date - 2020-03-23T17:22:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising