ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీం కోర్టులోనూ చందా కొచ్చర్‌కు చుక్కెదురు!

ABN, First Publish Date - 2020-12-01T21:02:42+05:30

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందా కొచ్చర్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సీఈఓ పదవి నుంచి బ్యాంకు తనను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో కొచ్చర్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందా కొచ్చర్‌కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సీఈఓ పదవి నుంచి బ్యాంకు తనను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ కొచ్చర్ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. తొలుత ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తులు ఆ వ్యాజ్యాన్ని కొట్టేశారు. దీంతో చందా కొచ్చర్ సర్వోన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకున్నారు. అయితే..సుప్రీంలోనూ ఆమెకు నిరాశే మిగిలింది. బాంబే కోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో తాము కల్పించుకోబోమని, ఇది బ్యాంకు, అందులోకి ఉద్యోగికి మధ్య జరిగిన ప్రైవేటు ఒప్పందానికి సంబంధించిన విషయమని స్పష్టం చేసింది.


చందా కొచ్చర్ ఐసీఐసీ బ్యాంకు సీఈఓగా ఉన్న సమయంలో వీడియాకాన్ సంస్థలకు మంజురు చేసిన రూ. 1875 రుణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చందా కొచ్చర్‌పై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూపులకు చెందిన వేణుగోపాల్ ధూత్‌పై కూడా కేసు నమోదు చేసింది.  

Updated Date - 2020-12-01T21:02:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising