ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో ప్యాకేజీ యోచనలో సర్కారు?

ABN, First Publish Date - 2020-04-06T06:05:00+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అయితే లాక్‌డౌన్‌ తర్వాతి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మరో ప్యాకేజీని ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • లాక్‌డౌన్‌ తర్వాతి ప్రభావాన్ని ఎదుర్కొనేందుకే

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అయితే లాక్‌డౌన్‌ తర్వాతి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మరో ప్యాకేజీని ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు  విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ ప్యాకేజీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి దోహదపడే విధంగా ఉండ వచ్చంటున్నారు. ప్యాకేజీ గురించి చర్చ జరిగిందని, అయితే ఇప్పటి వరకు ఏదీ ఖరారు కాలేదని సీనియర్‌ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ప్రభుత్వం మరో ప్యాకేజీని ప్రకటిస్తే కరోనా మూలంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకున్న మూడో చర్య అవుతుందని అధికారులు చెబుతున్నారు.


 ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీతో పాటు పన్ను చెల్లిం పుదారులు, వ్యాపార సంస్థలకు ఉపశమనం కలిగే ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. కాగా కొన్ని సంక్షేమ పథకాలు, ఇతర ప్రభుత్వ పథకాల్లో మార్పులు చేర్పులు చేసే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలు స్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలు ఇచ్చే స్కాలర్‌షిప్‌లు, ఫెలోషిప్‌లపైనా దృష్టి సారిస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు రబీ పంట కోతల సీజన్‌ ప్రారంభమైంది. వీటిపైనా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. 

Updated Date - 2020-04-06T06:05:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising