ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీవీకే గ్రూప్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, అతని కుమారుడిపై సీబీఐ కేసు

ABN, First Publish Date - 2020-07-02T11:20:12+05:30

జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ వెంకట కృష్ణారెడ్డి గునుపాటి, అతని కుమారుడు జీవీ సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసు నమోదు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : జీవీకే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ వెంకట కృష్ణారెడ్డి గునుపాటి, అతని కుమారుడు జీవీ సంజయ్ రెడ్డిలపై సీబీఐ కేసు నమోదు చేసింది.విమానాశ్రయం అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జీవీకే ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రభుత్వ,ప్రైవేటు భాగస్వామ్య సంస్థ మియాల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 2017-18లో 9 కంపెనీలకు బోగస్ వర్క్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు చూపించి 310 కోట్లరూపాయలను దారి మళ్లించినట్లు సీబీఐ ఆరోపించింది. దీనివల్ల 310 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. జీవీకే గ్రూప్ ప్రమోటర్లు తమ గ్రూప్ కంపెనీలకు ఆర్థిక సహాయం చేసేందుకు మియాల్ రిజర్వు ఫండ్ రూ.395 కోట్లను దుర్వినియోగం చేశారని సీబీఐ ఆరోపించింది. జీవీకే గ్రూప్ ఛైర్మన్ అయిన వెంకట కృష్ణారెడ్డి గునుపాటి, అతని కుమారుడు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన జీవీ సంజయ్ రెడ్డిలతోపాటు మియాల్, జీవీకే ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్, మరో 9 ప్రైవేటు కంపెనీలు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన కొందరు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. 

Updated Date - 2020-07-02T11:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising